తెలంగాణ

జాబితాలో నాగర్‌కర్నూల్‌వాసి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూలై 29: ఎమ్సెట్-2 లీకేజి వ్యవహరంలో సిబిసిఐడి సేకరించిన విద్యార్థుల జాబితాలో మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ విద్యార్థి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ విద్యార్థితోసహా తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కూన ప్రవీణ్‌కుమార్ తన కొడుకు కూన అవినాష్‌కుమార్‌ను ఎలాగైనా డాక్టర్‌ను చేయాలనే లక్ష్యంతో కోచింగ్ ఇప్పించి ఏపి ఎమ్సెట్ రాయించగా, అక్కడ 17,574 ర్యాంక్ రావడంతో ఇక మెడికల్ కళాశాలలో సీటు రాదని నిర్ధారించుకున్న ప్రవీణ్‌కుమార్ ఎలాగైనా సీటు సాధించాలనే ఉద్దేశంతో బ్రోకర్‌లను సంప్రదించి అక్రమ పద్ధతిలో సీటుకోసం ప్రయత్నించి రూ. 30 లక్షల నుంచి 50 లక్షల వరకు బ్రోకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. బ్రోకర్లు చెప్పిన విధంగా నడుచుకున్న ప్రవీణ్‌కుమార్ కుమారుడు అవినాష్‌కుమార్ ఎమ్సెట్-2 పరీక్ష రాయగా, 569 ర్యాంక్ వచ్చింది. ఎపి ఎమ్సెట్‌లో 17వేలకు పైగా ర్యాంక్‌ను సాధించిన అవినాష్‌కు ఎమ్సెట్-2లో 569 ర్యాంక్ రావడంతో అప్పట్లోనే నాగర్‌కర్నూల్‌లో అనుమానాలు వ్యక్తమైనాయి. సిబిసిఐడి విచారణలో ఇదే విషయం తేలినట్లు తెలుస్తోంది. విచారణ ప్రారంభమై వాస్తవాలను గ్రహించిన గుర్తించిన కూన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెల్లిపోయాడు. రెండు రోజుల నుంచి సిబిసిఐడి అధికారులు ప్రవీణ్‌కుమార్ గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.