తెలంగాణ

సీటు తెచ్చిన చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 29: ఎమ్సెట్ -2 లీకేజీ వ్యవహారంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులకు సంబంధమున్నట్లు తొలుత భావించినా.. తాజాగా 30మంది విద్యార్థులకు సంబంధం ఉన్నట్లుగా సిఐడి అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఈ నెల 9న నిర్వహించిన ఎమ్సెట్-2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 3,076 మంది విద్యార్థులు హాజరు కాగా, 13న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల సంఖ్య జిల్లాలో వందల్లోనే ఉంది. సిఐడి విచారణలో సుమారు 100మంది విద్యార్థులకు సంబంధమున్నట్లు తెలుస్తుండగా, సిఐడి అధికారులు నగరంలో పలు జూనియర్ కళాశాలల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం. ఈ లీకేజీతో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న జగిత్యాల, కోరుట్ల చెందిన ఇద్దరు విద్యార్థులను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా, 30 మందికి సంబంధమున్నట్లు వారు తెలిపినట్లు తెలిసింది. సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న విద్యార్థులను సిఐడి అధికారులు లోతుగా ప్రశ్నించి ఇతర వివరాలన్నింటిని సేకరించినట్లు తెలుస్తోంది. కోరుట్ల, జగిత్యాలకు చెందిన ఇద్దరు విద్యార్థులను సిఐడి అధికారులు గురువారం రాత్రే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని స్థానిక సిఐడి, పోలీసు అధికారులు ధ్రువీకరించడం లేదు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రద్దు చేయవద్దని, అక్రమార్కులపైచర్యలు తీసుకోవాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.

ఎమ్సెట్-2ను రద్దు చేయవద్దంటూ కరీంనగర్‌లో ధర్నా చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు