రాష్ట్రీయం

మైనింగ్ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: గనుల శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. లైసెన్స్ తీసుకొని మైనింగ్ చేపట్టని సంస్థలకు నోటీసులు జారీ చేసి లైసెన్స్ రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మేజర్ మినరల్స్‌లో 84 వర్కింగ్, 51 నాన్ వర్కింగ్ మొత్తం 135 గనులు ఉన్నాయి. మైనర్ మినరల్స్‌లో 1867 వర్కింగ్, 909 నాన్ వర్కింగ్ మొత్తం 2776 గనులు ఉన్నాయని అధికారులు తెలిపారు. లైసెన్స్‌లు పొందినప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉన్న వాటికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఐటి, గనుల శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. టియస్ ఐఐసి భవన్‌లో కెటిఆర్ శనివారం గనుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. లైసెన్స్ పొందిన గనుల పనితీరును సమీక్షించారు. అనుమతులు పొంది గనులు నిర్వహించని వారికి నోటీసులు జారీ చేసి, నిర్ణీత గడువు దాటినవారి లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. ప్రస్తుతం పని చేస్తున్న గనుల్లో ఒప్పందం ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవాలని, లేకుంటే వారి నుంచి వివరణ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మైనింగ్ అనేది ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు ఉపాధి కల్పించేలా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉన్న లైసెన్స్‌లను ఉపేక్షించేది లేదని చెప్పారు. మొత్తం ప్రక్రియను అన్‌లైన్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉండే వారికి ఆటోమెటిక్‌గా నోటీసులు వెళ్లేలా, వారి లైసెన్స్‌లు రద్దు చేసేలా సాఫ్ట్‌వేర్ ఉండాలని అన్నారు. దీంతో పాటు మొత్తం గనుల శాఖలో ఈ- ఆఫీసు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ఆదేశాలిచ్చారు. దీంతో పాటు ప్రతి ఫైలుపైన అధికారి నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని అన్నారు. గత 16సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో గనుల కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ తిరస్కరించి, నూతన పారదర్శక విదానంలో మరో సారి దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించారు.
మారుమూల ప్రాంతాల్లో గనుల ఆధారిత పరిశ్రమలు పెట్టే వారికి అవసరమైతే పారిశ్రామిక విధానంలో లేని ప్రత్యేక అనుమతులు, రాయితీలను ఇస్తామని మంత్రి చెప్పారు. గనుల శాఖలో ప్రభుత్వ ఆదాయం పెంచేలా పని చేస్తున్న నిబద్ధత గల అధికారులను ప్రోత్సహించాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో గనుల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, టియస్, యండిసి యండి ఇలమ్ భర్తి, డియం సుశీల్‌కుమార్ మొదలైన వారు పాల్గొన్నారు.