రాష్ట్రీయం

సెప్టంబర్ 2న దేశవ్యాప్త సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 31: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ జి సంజీవరెడ్డి వెల్లడించారు. ఈ సమ్మెలో సుమారు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రివర్‌బే హోటల్‌లో ఆదివారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఐఎన్‌టియుసి 185వ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంజీవరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కేంద్రం శాశ్వత ఉద్యోగాలకు స్వస్తిపలికి,కాంట్రాక్టు విధానానికి తెరలేపిందన్నారు. స్థూల జాతీయోత్పత్తి పెరిగిందని ప్రభుత్వం చంకలు గుద్దుకుంటోందని, అయితే దానితోపాటు పేదరికం, నిరుద్యోగం కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలోని సంపద సమాన పంపిణీ జరగాలన్నదే తమ ధ్యేయమన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నాయని ఆరోపించారు. ఎపి, తెలంగాణా ప్రభుత్వాలు కూడా చిన్న పరిశ్రమలను మూసివేసి, కార్మికులను రోడ్డున పడేస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులకు కనీసం రూ.18వేల వేతనం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు కార్మిక సంఘాలను పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో ఐఎన్‌టియుసిని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా వ్యవసాయ కార్మికులను కూడా తమలో కలుపుకోవడానికి కృషిచేస్తున్నామని సంజీవరెడ్డి వివరించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 24గంటలూ దుకాణాలు, సంస్థల తెరిచే ఉంచుకోవచ్చన్న కార్మిక చట్ట సవరణ వల్ల వెట్టిచాకిరి పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న సింగరేణీ కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసితో కలిసి పోటీ చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నామని సంజీవరెడ్డి ఈసందర్భంగా వెల్లడించారు. దీనిలో భాగంగా గతంలో పార్టీ నుంచి విడిపోయిన పార్టీలు, వ్యక్తులను తిరిగి విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎపి, తెలంగాణాలో రాజకీయ పరిణామాలు, పరిశ్రమల మూత, ఐఎన్‌టియుసి బలోపేతం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శులు జి భాస్కర్‌రెడ్డి, కెఎస్ సాయిబాబా, ఆదిల్‌షరీఫ్, ఉమామహేశ్వర్, ఐఎన్‌టియుసి యువజన విభాగం అధ్యక్షుడు జి సత్యజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి
సమావేశానికి హాజరైన ప్రతినిధులు