ఆంధ్రప్రదేశ్‌

త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 31: డ్రైవర్ అప్రమత్తత కారణంగా రాయగడ నుంచి విజయవాడ వెళుతున్న పాసింజర్ రైలుకు ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఏలూరు - వట్లూరు రైల్వే స్టేషన్ మధ్యలో ఇంజను పట్టాలు తప్పడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. పట్టాలు తప్పిన సమయంలో రైలు కేవలం 30 కిలోమీటర్ల వేగంలో వెళుతుండటంతో నిలుపుదల చేసేందుకు వీలుకలిగింది. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఏలూరు పవర్ పేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన రైలు వేగం పుంజుకుంటుండగా ఇంజనుభాగం పట్టాలు తప్పింది. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా నిలుపుదల చేశారు. ఈ విషయాన్ని విజయవాడ రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో ఇంజనీరింగ్ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ఇంజన్‌ను పట్టాల పైకి ఎక్కించి అనంతరం రైలును పునరుద్ధరించారు. దాదాపు 2 గంటల పాటు ఏలూరు - విజయవాడ మార్గంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలుపుచేశారు. రైల్వే ఉన్నతాధికారులు సంఘటన వివరాలపై విచారణ నిర్వహించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే శాఖాధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.