ఆంధ్రప్రదేశ్‌

జాడ లేని శకలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 31: గల్లంతైన వాయుసేన విమానం ఎఎన్-32 శకలాలు విశాఖ జిల్లా నాతవరం మండలం అటవీ ప్రాంతంలో ఉన్నట్టు అందిన సమాచారం వట్టిమాటగా తేలింది. సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు రెండు రోజుల కిందట వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా అటు వాయుసేన, ఇటు అటవీశాఖ బృందాలు విస్తృత గాలింపు జరిపాయి. నాతవరం మండలం సరుగుడు పరిసర అటవీ ప్రాంతాల్లో రెండు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది గాలింపు జరిపాయి. ఫోన్ కాల్ ఆధారంగా పేర్కొన్న ప్రాంతాలను బృందాలు జల్లెడపట్టాయి. అయితే, ఎటువంటి విమాన శకలాల జాడ కన్పించలేదు. నర్సీపట్నం డివిజనల్ ఫారెస్ట్ అధికారి(డిఎఫ్‌ఓ) జి.శేఖర్‌బాబు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ అటవీ సిబ్బంది రెండు రోజుల పాటు సరుగుడు ప్రాంతాన్ని క్షుణ్ణంగా గాలించారని తెలిపారు. తాను కూడా స్వయంగా బకులూరు, ఎర్రదిబ్బలు గ్రామాల్లో స్వయంగా గాలింపులో పాల్గొన్నట్టు వెల్లడించారు. కొండలపై ఉండే పశువుల కాపర్లకు ఇటువంటి అంశాలపై అవగాహన ఉంటుందని, వారుకూడా విమానం కూలినట్టు చెప్పలేదన్నారు. స్థానికుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి ఈ ప్రాంతంలో రెండు హెలికాఫ్టర్లు తక్కువ ఎత్తునుంచి ఎగరడం చూశారని తెలిపారు. అదికూడా విమానం గల్లంతైన తర్వాత జరిగిన సంఘటనగా గుర్తించామని చెప్పారు. విమానం లేదా హెలికాఫ్టర్ అటవీ ప్రాంతంలో కూలిపోతే మంటలు చెలరేగుతాయని, లేదంటే దట్టంగా పొగ కమ్ముకుంటుందని తెలిపారు. అటవీ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటే తమకు శాటిలైట్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. రెండు రోజుల గాలింపు పూర్తయిందని, సోమవారం నుంచి గాలింపు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఫోన్ కాల్ గురించిన సమాచారంపై ఆయన స్పందిస్తూ ఫోన్ చేసిన వ్యక్తి నుంచి సమాచారం సేకరించేందుకు ప్రయత్నించగా, తాను స్వయంగా చూడలేదని, ఎవరో చెప్పారని తెలిపాడన్నారు.