ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, జూలై 31: ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాకొట్టగా బోల్తాపడివున్న ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు జోసిల్ కంపెనీ వద్ద ఆదివారం జరిగింది. ప్రకాశం జిల్లా సువర్ణపాడు మండలంలోని రులగంపాడు గ్రామానికి చెందిన మెట్టుగుంట కళ్యాణ్, పి వెంకటసాయిరామ్, షేక్ రెహమాన్ వినుకొండలోని శామ్యూల్‌జార్జి జూనియర్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం గుంటూరు రూరల్ మండలం పెద పలకలూరులోగల విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే కాంపిటేటివ్ పరీక్షలకు హాజరయ్యేందుకు వినుకొండ నుండి శనివారం రైలులో బయలుదేరి ఫిరంగిపురంలోని కళ్యాణ్ బంధువు ఇంట్లో రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం పెద పలకలూరు విజ్ఞాన్‌లో పరీక్షకు హాజరయ్యేందుకు ఫిరంగిపురం నుండి ఆటోలో బయల్దేరారు. డోకిపర్రు జోసిల్ కంపెనీ వద్ద కుక్క ఒకటి రోడ్డుకు అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయి ఆటో బోల్తాకొట్టింది. వెంటనే గుంటూరు నుండి ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న మెండుగుంట కళ్యాణ్, పి వెంకటసాయిరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన షేక్ రెహమాన్, ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన ఆటోడ్రైవర్ ఏసోబులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

గుంటూరు అర్బన్ డిఎస్‌పి కె శ్రీనివాసరావు, సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మేడికొండూరు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.