ఆంధ్రప్రదేశ్‌

దశలవారీగా ఆన్‌లైన్ ట్రేడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 31: మార్కెట్ సంస్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇతోధిక కృషిలో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లోను ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, దుగ్గిరాల, కడప, కర్నూలు, ఆదోని, ఎన్నిగనూరు, హిందూపురం, కల్యాణ దుర్గంలో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు జరిపి పోటీ ధర కల్పించడంతో పాటు లావాదేవీలన్నీ పారదర్శకతతో జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న వ్యక్తిగత అమ్మకాల వల్ల కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు అక్రమాలకు పాల్పడేవారు. ఉదాహరణకు మార్కెట్ ఫీజు, కమీషన్ రుసుం, ఇతర అనధికార తగ్గింపుల సహా వివిధ ఖర్చులు రైతుల లాభం నుంచి తీసుకుంటున్నారు. లావాదేవీలు పూర్తయ్యాక కూడా అనేకమంది వ్యాపారులు, ఏజెంట్లు రైతులకు చెల్లింపుల్లో జాప్యం చేసేవారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ఒక వ్యాపారి లేదా ఒక ఏజెంటు స్టాక్స్ కోసం బిడ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా రైతుల ఖాతాకు నేరుగా డబ్బు బదిలీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది వ్యాపారులు వేలంలో పాల్గొనేందుకు వీలుండడంతో రైతులు తమ పంటలకు మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ మార్కెట్ వ్యవస్థలో పూర్తి పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉంటుంది. మరో 12 మార్కెట్లలో కూడా ఆన్‌లైన్ ట్రేడింగ్ జరిపేందుకుగాను జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఎన్‌ఎఎం)కు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
రైతులకు ఆన్‌లైన్ చెల్లింపులు చేయించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఒప్పంద వ్యవసాయ విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. సరకు రవాణాకు ఈ-పర్మిట్ విధానం అమలు చేయనున్నారు. 2015-16 సంవత్సరానికి రూ.469.64 కోట్లు మార్కెట్ ఫీజు లక్ష్యంగా నిర్దేశించగా రూ.470 కోట్లు వసూలు చేయడమైంది. 2015-16 సంవత్సరానికి గాను రైతుబంధు పథకం కింద 3414 మంది రైతులకు రూ.33 కోట్ల 42 లక్షల 66వేలు అందజేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 58వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచగల గోదాముల నిర్మాణం జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1,15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మంజూరు చేశారు. కార్బైడ్ విధానాన్ని నిరోధించడానికి 2015-16లో 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మాగవేయు గదులు (రైపెనింగ్) చాంబర్లు మంజూరు చేశారు. 275 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల శీతలీకరణ గదులు (కోల్డ్ రూమ్‌లు) మంజూరు చేశారు. పండ్లను సహజసిద్ధంగా మాగ వేయడానికి, శీతలీకరణ గదులను కూడా ఎథిలీన్ గ్యాస్‌ను ఉపయోగించి మాగవేయు గదులుగా మార్పు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 1300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఉల్లి గోదాములు మంజూరు చేశారు. 17వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్‌లు మంజూరు చేశారు. ఆర్‌ఐడిఎఫ్ నిధులతో గోడౌన్లు, క్షేత్ర గిడ్డంగుల నిర్మాణం జరుగుతోంది.
మార్కెట్ కమిటీల రాబడిలో 20 శాతం నిధులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు అనుసంధానం చేసి లింకు రోడ్లు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. ఉల్లి ధర నియంత్రణ కోసం ప్రభుత్వం సబ్సిడీ ధరలకు పౌర సరఫరాల శాఖ ద్వారా కిలో రూ.20కే అందించింది. టమోటా ధరలను స్థిరీకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంది.