ఆంధ్రప్రదేశ్‌

అంత్య పుష్కరాలకు బంద్ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 2: అంత్య పుష్కరాలకు బంద్ సెగ తగిలింది.. మంగళవారం రద్దీ కాస్త మందగించింది. పుష్కర పుణ్య స్నానాలు అంతంతమాత్రంగా సాగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్, సరస్వతి విఐపి ఘాట్‌లలో రద్దీ బాగానే ఉంది. ఉదయం నుంచీ జిల్లావ్యాప్త యాత్రికుల రద్దీ కన్పించగా, తొమ్మిది గంటల నుంచి రైళ్లలో జిల్లా యేతర యాత్రికులు పుష్కర ఘాట్‌లో స్నానాలు ఆచరించారు. అమావాస్య కావడంతో పితృదేవతలను స్మరించుకుంటూ అత్యధికంగా పిండ ప్రదాన క్రతువులు జరిగాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు పుణ్యస్నానాలు ఆచరించి, పితృకర్మలు చేసుకోవడం కన్పించింది. గోదావరి నది ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి నుంచి స్వల్పంగా గేట్లు ఎత్తివేసి దిగువకు వరద జలాలను విడిచిపెడుతున్నారు. దీంతో స్నాన ఘట్టాల్లో నీటి మట్టం తగ్గుదల కన్పించింది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో గంట గంటకూ యాత్రికుల రద్దీ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారు జాము నుంచి సుమారు 72 వేల మంది యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఘాట్లన్నీ పర్యాటక విశేషత సంతరించుకోవడంతో తిలకించడానికి కూడా సందర్శకులు అత్యధికంగా ఆసక్తికనబర్చారు. ఇప్పటివరకు ఆషాఢ మాసంలోవున్న పుష్కరుడు బుధవారం నుంచి శ్రావణ మాసంలోకి ప్రవేశిస్తున్నాడు. గోదావరి హారతి కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో మంగళవారం మూడో రోజు పుష్కర భక్తుల తాకిడి పెరిగింది.
అమావాస్య అయినప్పటికీ తెల్లవారుజాము నుంచి భక్తులు క్షేత్రానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. గోష్పాద క్షేత్రాల్లోని స్నాన ఘట్టాలు భక్తులతో నిండిపోయాయి. కొవ్వూరు పరిసర ప్రాంతాల నుండి విశాఖపట్నం, ఇతర జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. పలువురు పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు బిస్కట్లు, బాదంపాలు పంపిణీ చేశారు.

రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు

ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలు

భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం నాలుగో తేదీ నాటికి పుష్కర పనులు పూర్తి
రోజుకు 7.5లక్షల మందికి ఉచిత భోజనం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

విజయవాడ, ఆగస్టు 2: కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాలను పవిత్ర భావంతో నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కృష్ణమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఆయనన్నారు. గత ఏడాది నిర్వహించిన గోదావరి పుష్కరాల అనుభవంతో ఈసారి కృష్ణా పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 156 ఘాట్ల నిర్మాణం పూర్తిచేయడంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నట్లు తెలిపారు. పుష్కర పనులన్నీ మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని వివరించారు. పుష్కర ఘాట్లను నాలుగు విభాగాలుగా విభజించడంతో పాటు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఉన్నతాధికారులను నియమిస్తున్నామని, అన్ని శాఖలతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. ఆగస్టు 5 నుండే అధికారులు కేటాయించిన విధుల్లో చేరతారని చెప్పారు. 11న గోదావరి అంత్య పుష్కరాల అనంతరం పవిత్ర సంగమం ఫెర్రీ వద్ద సుమారు వెయ్యిమంది జానపద కళాకారులతో ర్యాలీ నిర్వహించి, పవిత్ర హారతితో పుష్కరాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 12న ఉదయం కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి చేతులమీదుగా పుష్కర స్నానాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పుష్కరాల 12 రోజులు కృష్ణానదిలో ఏ ప్రాంతంలో పుణ్యస్నానం చేసినా పునీతులవుతారని చంద్రబాబు పేర్కొన్నారు.
4న ప్రముఖులకు ఆహ్వానాలు
ఈ నెల 4న ఢిల్లీ వెళ్లి కృష్ణా పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అందరు ఎంపీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బౌద్ధమత గురువు దలైలామాను ప్రత్యేకించి ఆహ్వానించనున్నామని తెలిపారు. రవిశంకర్, జగ్గీవాసుదేవ్, బాబా రామ్‌దేవ్‌లను ఆహ్వానిస్తామన్నారు. కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు అతిథ్యంలో ఎలాంటి లోటు రాకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంతి చంద్రబాబు పేర్కొన్నారు. అక్షయపాత్ర ఆధ్వర్యంలో రోజుకు మూడు లక్షల మందికి, టిటిడి రోజుకు లక్ష మందికి, వివిధ స్వచ్ఛంద సంస్థలు రోజుకు మూడున్నర లక్షల మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నారని చెప్పారు.
అక్షయ ఫౌండేషన్ గొల్లపూడి వద్ద శాశ్వత ప్రాతిపదికన కిచెన్‌ను సైతం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. పుష్కర నగర్లు, రైల్వే, బస్‌స్టేషన్ల వద్ద ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. విజయవాడ వాసులు ఇక్కడికి వచ్చే అతిథుల్లాంటి భక్తులకు ఆతిథ్యం రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే పుష్కరాల 12రోజులూ పుష్కర నగర్లు, ఘాట్లకు 500 మీటర్ల దూరంలో ఉండే అన్ని మద్యం దుకాణాలను మూసివేయిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు.

స్నాన ఘట్టాల్లో తగ్గిన నీటిమట్టం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఆగస్టు 2: గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడానికి ఉపకరిస్తున్న పోలవరం కుడి కాలువ గండి ప్రభావం పుష్కర స్నానాల యాత్రికులపై పడింది. గండి కారణంగా పోలవరం కుడి కాలువలోకి నీరు తోడే పట్టిసం ఎత్తిపోతల పథకం మోటార్లు నిలిపివేయడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగింది. అయితే ఎగువభాగం నుండి కొంత వరద వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను మూసి, నీటి మట్టం నిలబెడుతున్న జలవనరుల శాఖ అధికార్లు ముందుజాగ్రత్తగా మళ్లీ సముద్రంలోకి నీరు విడుదలచేయడం ప్రారంభించారు. బ్యారేజి 175 గేట్లను 0.3 మీటర్ల మేరకు ఎత్తివేసి వరద జలాలను దిగువకు విడుదల చేస్తుండటంతో అఖండ గోదావరి స్నాన ఘట్టాల్లో నీటి మట్టం తగ్గింది. దీనితో పుష్కర స్నానాలు చేసే భక్తులకు కొంతమేర ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. ఘాట్లలోలో మునకవేసే పరిస్థితి లేక చెంబులు ఉపయోగిస్తున్నారు. మరికొందరు జల్లు స్నానంపై ఆధారపడుతున్నారు.
భద్రాద్రిలో సంబరంగా అంత్య పుష్కరాలు
భద్రాచలం, ఆగస్టు 2: కలియుగ వైకుంఠం ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలోని గోదావరి తీరంలో మంగళవారం మూడోరోజు అంత్య పుష్కరాలు సంబరంగా జరిగాయి. పిండప్రదానాలు సమర్పించేందుకు అమావాస్య దివ్యమైన ముహూర్తం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు. పుష్యమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామికి మహా పట్ట్భాషేకం జరిగింది. కుంభ, ద్వయ, అష్ట, ద్వాదశ, నక్షత్ర హారతులిచ్చారు. పుబ్బా నక్షత్రం సందర్భంగా ఆండాళ్లమ్మ తిరునక్షత్రోత్సవాలు జరిగాయి.