ఆంధ్రప్రదేశ్‌

ముమ్మరంగా గండి పూడ్చివేత పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఆగస్టు 2: పోలవరం కుడికాల్వకు పడిన గండి పూడ్చివేత పనులను మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరం చేశారు. గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల నుండి పోలవరం కాల్వ ద్వారా కృష్ణానదికి తరలిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలో 122 కి.మీ. అండర్ టనె్నల్ వద్ద కాల్వకు గండి పడింది. సమాచారం అందిన వెంటనే సంఘటన ప్రాంతానికి వెళ్లిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాత్రి కూడా అక్కడే బసచేసి పూడ్చివేత పనులను వేగవంతం చేయించారు. అధికారులకు సూచనలిస్తూ ఆయన పనులను పర్యవేక్షిస్తున్నారు. పట్టిసీమ వద్ద పంపులు నిలిపివేసినా గండి పడిన ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో అండర్ టనె్నల్ వద్ద రింగ్‌బండ్ నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. గండి పడిన ప్రాంతాన్ని దేవినేని ఉమతో పాటు జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, దాసరి బాలవర్ధనరావు, తదితరులు పరిశీలించారు. ఇదిలావుంటే, కృష్ణా నదిలోకి గోదావరి జలాల తరలింపును పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉమ చెప్పారు. బుధవారం ఉదయం నుండి నీరు యథావిధిగా తరలించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన విలేఖర్లకు తెలిపారు.

కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల గండి పూడ్చివేత పనులకు అంతరాయం కలిగిందన్నారు. గండి పడిన ప్రాంతంలో రింగ్‌బండ్ వేసి పూడ్చివేత పనులు చేపట్టామని ఆయన వివరించారు.