తెలంగాణ

ప్రతిపక్ష నేతలు మా గ్రామానికి రావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపాక, ఆగస్టు 2: తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని ఎర్రవల్లి భూనిర్వాసితులు గ్రామ సమీపంలో నోటీసుబోర్డు వేశారు. మంగళవారం మండలంలోని ముంపు గ్రామమైన ఎర్రవల్లిలో నిర్వాసితులంతా భూములు ఇచ్చేందుకు సంసిద్దంగా ఉన్నామని, తమ గ్రామానికి ప్రతిపక్షాలు వచ్చి గొడవలు సృష్టిస్తూ రాజకీయాలు చేయవద్దని హెచ్చరికలు జారీచేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేందుకు ముందుకొచ్చిందని, ప్రతిపక్ష నేతలు గ్రామానికి వచ్చి రాజకీయం చేయడం వల్ల తమకు జరిగే న్యాయం మరింత జాప్యమైతుందన్నారు. తమ మేలు కోరుకునే ఏ పార్టీ నాయకులైనా గ్రామానికి రావద్దని నోటీసుబోర్డు వేస్తు సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధికోసం తమను పావుల్లా వాడుకోవద్దన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి
జయరాజ్ రిమాండ్
తొగుట/ కొండపాక, ఆగస్టు 2: ముంపుగ్రామమైన ఎర్రవల్లిలో లాఠీచార్జి ఘటనకు ముఖ్యకారకుడైన సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్‌తో పాటు మరో నలుగురిని తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్ శివారులో వాహనాల తనిఖీలో అరెస్టు చేసి జయరాజ్‌ను కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తొగుట ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.
కొండపాక మండలం ఎర్రవల్లిలో నిర్వాసితులను రెచ్చగొట్టి పోలీసుల మీదికి ఉసిగొల్పడంతో వారు రాళ్లదాడికి దిగారని, దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం లాఠీచార్జీ చేశారన్నారు. ఇందుకు ముఖ్యకారకుడైన జయరాజ్ పై ఏ-3 నిందితునిగా కేసు నమోదు కాగా రిమాండ్ చేసినట్లు కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. పోలీసు యాక్టు 30 జిల్లాలో అమలులో ఉన్నందున ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందస్తుగా భూనిర్వాసిత గ్రామాల పరిసరాల్లో వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.