రాష్ట్రీయం

నీటి ఎద్దడి తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీరు అడగంటి డెడ్ స్టోరేజికి చేరుకోవడంతో వచ్చే వేసవిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. శ్రీశైలంలో ప్రస్తుతం 30 టిఎంసి నీరు మాత్రమే అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది వర్షాకాలం వరకు రబీతోపాటు తాగునీటికి కనీసం వంద టిఎంసి నీరు అవసరమవుతాయి. కాని కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఇదే పరిస్ధితి తెలంగాణలో నెలకొని ఉంది. కృష్ణా జలాలపై ఆధారపడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల తాగునీటి అవసరాలు ఉన్నాయి. తాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాలు ఇటీవల జరిగిన కృష్ణా బోర్డుకు నివేదికను సమర్పించాయి. కాని దీనిపై బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు విఫలమైనా అక్టోబర్, నవంబర్ నెలల్లో రుతుపవనాలకు కృష్ణా నదికి వరదలు వస్తాయి. ఈ ఏడాది రుతుపవనాలు రెండు దఫాలు విఫలంకావటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతమంతా బోసిపోయి ఉంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్ధను క్రమబద్ధీకరించారు. కృష్ణా బోర్డు సమావేశం జనవరి నెల మొదటి వారంలో జరగనుంది. జనవరి, మార్చి, మే నెలలకు కలిపి మొత్తం 30 టిఎంసి నీటిని నాగార్జునసాగర్ నుంచి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరనుందని జలవనరుల శాఖ ఉన్నతాధికారి తెలిపారు.