ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో సింగపూర్ విద్యాసంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల స్థాపనకు సింగపూర్‌కు చెందిన యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా ఫౌండేషన్ (యుడబ్ల్యుసిఎస్‌ఇఎఎఫ్) ముందుకు వచ్చింది. ఏపిసిఆర్‌డిఎ కార్యాలయంలో శుక్రవారం ఫౌండేషన్ ప్రతినిధులు సిఆర్‌డిఏ అధికారులతో జరిపిన సమావేశంలో విద్యాసంస్థల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ కాలేజ్ హెడ్ క్రిస్ ఎడ్వర్డ్స్ చెప్పారు. తమ సంస్థల్లో 90 దేశాల విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా అమరావతిలో అత్యున్నతస్థాయి వౌలిక సదుపాయాలతో విద్యాసంస్థలు ఏర్పాటుకు సిద్ధమన్నారు. ఐదువేల మంది వరకు చదువుకునే విధంగా అత్యాధునిక వసతులు కల్పించగలమన్నారు. కాగా నిర్దుష్టమైన ప్రతిపాదనలతో వస్తే పరిశీలిస్తామని సిఆర్‌డిఏ అధికారులు తెలిపారు.

చిత్రం...
సిఆర్‌డిఎ ప్రతినిధులతో చర్చలు
జరుపుతున్న సింగపూర్ ప్రతినిధులు