ఆంధ్రప్రదేశ్‌

క్షమించాలి... ఇక కూల్చం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 5: కృష్ణా పుష్కరాలు.. రహదారుల విస్తరణ పేరిట విజయవాడ నగరంలో ఎడాపెడా పురాతన ఆలయాలను తొలగించడంపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు క్షమాపణ చెప్పారు. తొలగించిన కొన్ని ప్రధాన ఆలయాలను ప్రభుత్వ ఖర్చుతోనే పునఃప్రతిష్ఠ చేస్తామని ఆయన శుక్రవారం హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జీవో జారీ చేస్తామన్నారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా నగరంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఐదు రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో సమితి కన్వీనర్ విద్యాధరరావు, విహెచ్‌పి నేత దుర్గాప్రసాద్ రాజు, పివి శ్రీరాంసాయి, పీయూష్ తదితరులు శుక్రవారంనాడు మంత్రిని కలిసి జరిగినదంతా వివరించారు. అనంతరం మంత్రిని వెంటబెట్టుకుని దీక్ష శిబిరానికి వెళ్లారు. అక్కడ వారిని ఉద్దేశించి మంత్రి పలు హామీలు ఇచ్చారు. తొలగించిన ఆలయానికి సమీపంలోనే సీతమ్మవారి పాదాలు పునఃప్రతిష్ఠ, సమీపంలోని రాజీవ్‌గాంధీ పార్క్‌లో దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం, పాతాళ వినాయక ఆలయాలను తిరిగి ప్రతిష్ఠింపచేస్తామని హామీనిచ్చారు. ఇతర ఆలయాలకు సంబంధించి ప్రైవేట్ స్థలాలు చూపితే ప్రభుత్వ ఖర్చుతో వాటిని పునఃప్రతిష్ఠింప చేయగలనని హామీనిచ్చారు.
చిత్రం... నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేస్తున్న మంత్రి మాణిక్యాలరావు