రాష్ట్రీయం

వడ్డీ వ్యాపారుల కట్టడికి త్వరలో ఆర్డినెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: విజయవాడ కాల్‌మనీ- సెక్స్ రాకెట్ కేసు ప్రకంపనల నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల నియంత్రణ బిల్లు రూపొందించేందుకు కసరత్తును ప్రారంభించింది. ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడం అనుమానమే. హడావిడిగా ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టేకంటే విస్తృతంగా చర్చించి ఆర్డినెన్సు తెస్తే బాగుంటుందని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఆర్డినెన్సు తెచ్చే అవకాశం ఉంది. బిల్లును తొందరపడి ప్రవేశపెడితే పరపతి వ్యవస్ధ కుప్పకూలుతుందని, నిజాయితీగా వడ్డీ వ్యాపారం చేసే వారు ఈ వ్యాపారాన్ని మానుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం మనీ లెండర్స్ ఆగడాలను నిరోధించేందుకు ఒక ముసాయిదా బిల్లును రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది. ప్రస్తుతం ఈ బిల్లు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బిల్లులో అనేక మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. మిగతా వ్యాపారాల మాదిరిగానే ఇకపై ఫైనాన్స్ వ్యాపారం చేయాలనుకుంటే ప్రభుత్వం వద్ద పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ, పోలీసు వ్యవస్ధలకు నియంత్రణ చేసే అధికారాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే సంస్ధ బయట వ్యాపారి పేరు, వడ్డీ రేటును బహిరంగంగా రాయాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్ధితుల్లో అప్పును మించి వడ్డీ దాటరాదు. మెడికల్, రిటైల్, హోటల్ వ్యాపారం, మద్యం వ్యాపారం చేసేవారు లైసెన్సు ఎలా తీసుకుంటారో ఆంధ్రాలో ఫైనాన్స్ వ్యాపారం చేయాలనుకుంటే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక లైసెన్సుతో ఒక ప్రాంతంలోనే వ్యాపారం చేయాల్సి ఉంటుంది. వేరు వేరు ప్రాంతాల్లో ఒకే లైసెన్స్‌తో వ్యాపారం చేస్తే మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి వడ్డీరేట్లను వసూలు చేయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారిపై కేసులు నమోదై కోర్టు విచారణకు వెళ్లేటట్లుంటే, ఆస్తులను జప్తు చేసే అధికారం సిఐడి అధికారులకు ఉంటుంది. కేసు రుజువైతే ఫైనాన్స్ వ్యాపారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కాగా ప్రతి జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై నమోదయ్యే కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ప్రాసిక్యూటర్‌ను నియమించేప్రతిపాదనను బిల్లులో చేర్చారు.