రాష్ట్రీయం

కన్న కొడుకే కాలయముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 20: పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు... నిజంగా నరకం ఉందో లేదో కానీ, ఓ పుత్రుడు మాత్రం కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి చేతికి వైర్లు చుట్టి, విద్యుదాఘాతానికి గురిచేయడం ద్వారా హత్యచేశాడు. వళ్లు జలదరించే ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదూరు గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకుంది. రామచంద్రపురం ఎస్సై లఖావతు శ్రీనునాయక్ కథనం ప్రకారం ఓదూరు గ్రామానికి చెందిన నెల్లి వెంకటరావు(55)కు నలుగురు కుమారులు. వారిలో మూడోవాడైన నాగేశ్వరరావు వ్యసనాలకు బానిసై అప్పులుజేస్తూ వాటిని తీర్చాలని తండ్రి వెంకటరావును వేధించేవాడు. ఈక్రమంలో శనివారం రాత్రి తండ్రితో తగాదా పడిన నాగేశ్వరరావు అర్ధరాత్రి స్విచ్‌బోర్డు నుండి వైరు తీసి, నిద్రిస్తున్న తండ్రి వెంకటరావుచేతికి చుట్టి, స్విచ్ ఆన్ చేశాడు. విద్యుదాఘాతానికి గురైన వెంకటరావు బిగ్గరగా కేకలు వేశాడు. దీనితో వెంకటరావు మరో కుమారుడు హాలులోకి వచ్చి పరిస్థితిని గమనించి, కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని, విద్యుదాఘాటానికి గురైన వెంకటరావును సమీపంలోని కరప మండలం వేళంగి గ్రామంలోని ఓ వైద్యుని వద్దకు వెంకటరావును తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యుడు ధ్రువీకరించారు. ఈమేరకు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదుచేశారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో ఆదివారం వెంకటరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సిఐ పచ్చా కాశీవిశ్వనాధ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
అనంతపురం సిటీ, డిసెంబర్ 20: అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల పరిధిలోని సంజీవపురం గ్రామం వద్ద ఆదివారం అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి 108 తులాల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఎస్పీ రాజశేఖర్‌బాబు అనంతపురంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ధర్మవరం రూరల్ మండలం ఉప్పునేసినపల్లి గ్రామానికి చెందిన భీమినేని అమర్‌నాథ్‌నాయుడు(30) సుమారు 63 నేరాలకు పాల్పడ్డాడు. దీంతో ఇతడిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు ఆదివారం బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామ సమీపంలోని కాటమయ్యకొండ దేవాలయం వద్ద ఉండగా అరెస్టు చేశారు. అలాగే అతడి నుంచి రూ. 30 లక్షల విలువ చేసే 108 తులాల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అమర్‌నాథ్‌నాయుడు రైతు కుంటబానికి చెందినవాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లికి తోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేసేవాడు. అయితే కాలక్రమేణా ఇతడు దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో గ్రామానికి సమీపంలో ఉన్న హంపాపురం, మరూరు, రామనేపల్లి, కృష్ణంరెడ్డిపల్లి, రాప్తాడు ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో భాగంగా 2006లో రాప్తాడు పోలీసులు అతడిని అరెస్టు చేసి కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు. 2008 నుంచి 2010 వరకూ జైలులో ఉంటూ పాత కేసులు కొట్టేశాక తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. 2012 నుంచి మళ్లీ చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, బ్యాగు లిఫ్టింగులు చేయడం మొదలు పెట్టి, రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఇతడిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆదివారం బత్తలపల్లి సమీపంలోని సంజీవపురం కాటమయ్యకొండ ఆలయం వద్ద అరెస్టు చేశారు. దొంగను అరెస్టు చేసిన ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, రూరల్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్‌ఐలు సుబ్బరాయుడు, హేమంత్‌కుమార్, రాంభూపాల్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

నిబంధనల మేరకే ఎమ్మెల్యేల సస్పెన్షన్: కోడెల
గుంటూరు, డిసెంబర్ 20: నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఎమ్మెల్యేలను శాసనసభ నిబంధనల ప్రకారమే సస్పెండ్ చేశానని, తనకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరులోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో మూడురోజుల సభా సమయాన్ని సభ్యులు వృథా చేశారన్నారు. సభలో బాక్సైట్‌తో పాటు అనేక ప్రజాసమస్యలు చర్చకు రాలేదన్నారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్‌లను సభ్యులు వినియోగించుకోవడం లేదన్నారు. విపక్ష సభ్యులు సభ బయట ఒక రకంగా, సభలో మరోవిధంగానూ ప్రవర్తిస్తున్నారన్నారు. గతంలో పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలో కూడా నిబంధనలను అతిక్రమించిన సభ్యులను సస్పెండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయన్నారు. పార్లమెంట్‌లో కూడా అనర్హత వేటు వేసిన సందర్భాలున్నాయని స్పీకర్ ఉదహరించారు. సభను సజావుగా జరిపేందుకు తాను కఠిన చర్యలు తీసుకోక తప్పడంలేదని స్పష్టం చేశారు. సభ మరో రెండు రోజులు జరగనున్నందున సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. గతంలో 294 మంది సభ్యులు ఉండేవారని, ఇప్పుడు 175 మంది సభ్యులున్న సభలో ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు సభ్యులకు మంచి అవకాశం ఉందని కోడెల హితవు పలికారు.
ఆ అధికారం స్పీకర్‌కు లేదు: రామచంద్రయ్య
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, డిసెంబర్ 20: ఉద్రేకంగా మాట్లాడారని ఒక ఎమ్మెల్యేను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు లేదని శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు చెప్పడం, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెండ్ చేసేయడం దారుణమన్నారు. ఉద్రేకంలో మాట్లాడటం వంటి సంఘటనలు పార్లమెంటు, అసెంబ్లీలో జరుగుతూనే ఉంటాయని, దీనికి ఒక ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్ చెయ్యడం సరికాదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ శివప్రసాద్ తనకు మంచి స్నేహితుడని, అయినా స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించేటపుడు ఆయన తీసుకునే నిర్ణయాలు ఏ పార్టీకీ వంతపాడకుండా అందిరకీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని దొంగల నాయకుడని టిటిడిపి ఎమ్మెల్యేలు ఎన్నోసారు పిలిచారని, ఆ విధంగా వ్యాఖ్యానించిన టిడిపి ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదో చెప్పాలని రామచంద్రయ్య ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అకౌంట్స్ సెటిల్ చేసుకోవడానికి వేదికగా వినియోగించుకుంటున్నట్టుగా కనపడుతోందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, వైసిపిలకు కేవలం ఒక శాతం ఓట్లు మాత్రమే తేడావుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించామని చెబుతున్న గోదావరి పుష్కరాల్లో 31 మంది మృతి చెందారని, దానికి బాధ్యులెవరు, ఎవరిని శిక్షించారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. కాల్‌మనీ పేరుతో మోతుబరి రైతులపై కూడా పోలీసులతో దాడులు చేయించడం దారుణమని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎక్కువ వడ్డీలు వసూలుచేసే వారిని వీడి, గ్రామాల్లోని రైతుల ఇళ్లపై దాడులు చెయ్యడం సమంజసం కాదన్నారు. కాల్‌మనీ అంశాన్ని నిర్వీర్యం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కానీ ప్రభుత్వంపై మచ్చపడుతుందని వాటిని రికార్డు చేయడం లేదన్నారు. రాజధాని విషయంలో అన్నీ తప్పుడు అఫిడవిట్‌లను సమర్పించారని, ఈ విషయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళిన వారంతా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. చంద్రబాబుది అవకతవకల పరిపాలనని, మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రామచంద్రయ్య వ్యా