రాష్ట్రీయం

విశాఖలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 20: కాల్ మనీ కేసులో ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చీటీ మొత్తాన్ని చెల్లించాలంటూ తన తల్లిపై వత్తిడి తెచ్చినందుకు అవమానాన్ని భరించలేక ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం విశాఖలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కంచరపాలెం సమీపంలోని పెదకొత్తూరులో మైలపల్లి గరగయ్య నివసిస్తున్నాడు. ఇతడు రాడ్ బెండర్‌గా పనిచేస్తున్నాడు. గరగయ్య భార్య దేవి ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. దేవి కొంత కాలంగా ఆప్రాంతంలో చీటీలు వేస్తూ వస్తోంది. 10 లక్షల రూపాయల చీటీ పాట ఇటీవల జరిగింది. పాట పాడుకున్న వారు ఆ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా దేవి మీద వత్తిడి తీసుకువచ్చారు. పదే పదే వారు ఇంటికి వచ్చి చీటీ మొత్తాన్ని అడగడంతో దేవి కుమారుడు వినయ్ అవమానానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. వినయ్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 20: భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఆదివారం భూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. తెల్లవారు జాము నుంచే సిపిఐ, సిపిఎం నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా వామపక్షాల నేతలు రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు. విమానాశ్రయ నిర్మాణానికి రైతులుల, ఆయా గ్రామాల ప్రజల నిరసనల మధ్య జిల్లాయంత్రాంగం ఇటీవలే భూ సర్వే పూర్తి చేసింది. దీంతో భూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిండానికి గురువారమే అనుమతి కోరుతూ చలానా కూడా కట్టింది. ఈలోగా పోలీసులు ముందస్తు అరెస్టులకు తెర తీశారు. విజయనగరం పట్టణంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, శృంగవరపుకోటలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు తదితరులను వారివారి ఇళ్లనుంచి గురువారం తెల్లవారు జామున పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీసు స్టేషన్లుకు తరలించారు. భోగాపురం ప్రాంతంలోని సిపిఎం, సిపిఐ నాయకులను, ప్రజాసంఘ నాయకులను కూడా అరెస్టు చేసారు. పాదయాత్రలో పాల్గొంనేందుకు విశాఖనుంచి భోగాపురం వస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నరసింగరావు, మరికొందరు నాయకులను ఎ.రావివలస వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించే ప్రయత్నం చేసారు. కానీ పోలీసుల చర్యను నిరసిస్తు నరసింగరావు తదితరులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో వారిని అరెస్టుచేసి భోగాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

పాదయాత్రకు వస్తున్న సిపిఎం నేత నరసింగరావును
భోగాపురం వద్ద అరెస్ట్ చేస్తున్న పోలీసులు

బాక్సైట్‌పైనే మావోల గురి
నేటి నుండి మన్యంలో నిరసన వారోత్సవాలు ౄ తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

నర్సీపట్నం/ సీలేరు, డిసెంబర్ 20: బాక్సైట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సిపిఐ మావోయిస్టులు సన్నద్ధమవుతున్నారు. మొదటి నుంచి బాక్సైట్‌ను వ్యతిరేకిస్తున్న సిపిఐ మావోయిస్టులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ21 నుంచి 27 వరకు బాక్సైట్‌కు వ్యతిరేకంగా నిరసన దినాలు పాటించాలని, ఈనెల 26న ఎఒబి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నుండి నిరసన దినాలు ప్రారంభం అవుతుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం బందోబస్తును కట్టుదిట్టం చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రధాన కూడళ్ళ వద్ద వాహనాల తనిఖీ ముమ్మరం చేసారు. ప్రధాన పార్టీలైన టిడిపి, బిజెపి నాయకులకు ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా వారిని అప్రమత్తం చేసారు. సాధ్యమైనంత వరకు పోలీసులకు తెలియకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళరాదని, మావోయిస్టుల నుండి ప్రాణహాని ఉన్నవారు మైదాన ప్రాంతాలకు తరలివెళ్ళాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు మన్యంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాక్సైట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాలను తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాకే వదిలి పెడుతున్నారు.
బాక్సైట్‌కు వ్యతిరేకంగా సోమవారం నుంచి మావోయిస్టులు నిరసన వారోత్సవాలకు పిలుపునివ్వడంతో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ఈనెల 26న ఎఒబి బంద్‌కు పిలుపునిచ్చారు. నిరసన వారోత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే మావోయిస్టులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో బ్యానర్లు కూడా వేలాడ దీసారు. ఎఒబిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.