రాష్ట్రీయం

పుష్కర తీరంలో అపర తిరుమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 7: కృష్ణా పుష్కరాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం 7కోట్ల 50 లక్షల రూపాయలను వేర్వేరు రూపాల్లో ఖర్చు చేస్తోంది. ఇందులో ప్రధానంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో నమూనా ఆలయం నిర్మాణం జరిగింది. ఇందుకు కోటీ 20 లక్షల రూపాయలు వ్యయమైంది. 82 అడుగుల వెడల్పు, 130 అడుగుల పొడవు విస్తీర్ణంలో నమూనా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తిరుమల తరువాత ఇక్కడి దేవస్థానంలో స్వామివారికి జరిగే అన్ని సేవలను మూల విరాట్‌కు జరుపుతున్నారు. ఆదివారం ఉదయం మహా సంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శనం ప్రారంభించారు. అయితే ఈనెల 12 తేదీ నుంచి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తులకు సేవలందించేందుకు గాను 650 మంది తితిదే సిబ్బందిని, మరోవెయ్యి మంది శ్రీవారి సేవకులను వినియోగిస్తున్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, పాకెట్ సైజ్ ఫొటో అందించనున్నారు. స్వరాజ్య మైదానంలో సుమారు అర కిలోమీటరు పొడవు గల నాలుగు లైన్లతో కూడిన క్యూలైన్లను ఏర్పాటు చేసారు. వీటి ద్వారా నిత్యం కనీసం లక్ష మంది వరకు స్వామివారిని దర్శించుకోగలరని అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు మాట్లాడుతూ ప్రతిరోజూ లక్ష మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు ఎస్‌వి సంగీత నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం, అమరావతిలోని బుద్ద విగ్రహం, కృష్ణాజిల్లా శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం, మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయంలోను నిత్యం ఆధ్యాత్మిక భక్తి సంగీత ప్రవచనాలుంటాయి.
తితిదే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఫలపుష్ప ఫొటో మ్యూజియం, ఆయుర్వేద పుస్తక ప్రదర్శనశాలను అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం నమూనా ఆలయం నుంచి ఊరేగింపుగా పద్మావతి ఘాట్‌కు వెళ్లి పుష్కర హారతి ఇవ్వడం ద్వారా కృష్ణమ్మకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తామని సాంబశివరావు చెప్పారు.

ఉల్లాసంగా
హేపీ సండే!
విజయవాడ, ఆగస్టు 7 : నగర పాలక సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆద్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం ఆట పాటలతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. నగరంలోని కార్పొరేషన్ పాఠశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ కోనేరు శ్రీధర్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్‌లు ప్రారంభించారు. విఎంసి కమిషనర్ సతీమణి అండాళ్లు వీరపాండియన్ విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి తన చిననాటి స్మృతులను గుర్తుచేసుకొన్నారు. ఆమెతోపాటు నగర కార్పొరేటర్లు మేము సైతం అంటూ వివిధ క్రీడాంశాల్లో పాల్గొని ఉత్సాహపర్చారు. అంతేకాకుండా జానపద నృత్యాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ప్రదర్శనలు హాపీ సండే కార్యక్రమంలో ప్రత్యేకత చాటుకున్నాయి. సెపక్‌తక్రా, వాలీబాల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయిట్, గ్రామీణ క్రీడలైన తొక్కుడు బిళ్ల, ఒప్పులకుప్ప వంటి పలు క్రీడాంశాల్లో విద్యార్థులతో పాటు నగర పౌరులు కూడా పెద్దఎత్తున పాల్గొని ఆడిపాడారు. ఈసందర్బంగా మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలనేది హ్యాపీ సండే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నగర ప్రజలంతా కుటుంబ సమేతంగా సరదాగా ఉల్లాసంగా కొంత సమయం గడపటంలో ఆనందంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఎస్‌టివిఆర్‌ఎం స్కూల్, ఎకెటిఎం స్కూల్, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, తదితర విఎంసి పాఠశాలల విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో కట్టిపడేసారు.