వాళ్ల జీతాలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య, పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలుతీసుకోవాలని హైకోర్టు బుధవారం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఉద్యోగులకు రెండు ప్రభుత్వాలు వేతనాలు చెల్లించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్పొరేషన్‌కు చెందిన కొంత మంది హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మే 6వ తేదీన జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. డెయిరీ డెవలప్‌మెంట్ సంస్ధ విభజన కాకుండా తమను ఏపికి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్రమమని 47మంది పిటిషన్‌దార్లు హైకోర్టుకు విన్నవించారు. రెండు రాష్ట్రప్రభుత్వాలు వివాదాలను పరిష్కరించకుండా ఉద్యోగులను గాలికి వదిలేయడం,వారికి వేతనాలు చెల్లించకపోవడం, దీని వల్ల ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురికావడం సరైన విధానం కాదని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ, హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న 49 మంది ఉద్యోగుల్లో 34 మందిని తెలంగాణకు, మిగతా వారిని ఆంధ్రకు కేటాయించారన్నారు. మిల్క్ ప్రాడక్ట్స్ ఫ్యాక్టరీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను వెనక్కు తీసుకుంటున్నట్లు, వారికి వేతనాలు చెల్లించనున్నట్లు ఏజి హైకోర్టుకు చెప్పారు. మిగిలిన పది మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆస్తుల పంపకంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు తెలిపారు.కేంద్రం నిర్ణయం వెలువడకుండా, ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీప్ చేసిందన్నారు. ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎలా తీసుకుంటుందని హైకోర్టు తెలంగాణ ఏజిని ప్రశ్నించింది. ఉద్యోగుల ఆఫ్షన్లు, వారి స్థానికత ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఏజి తెలిపారు.