తెలంగాణ

నరుూం నేర సామ్రాజ్యంపై ఇక సిట్ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కరడుగట్టిన నేరగాడు, మాజీ మావోయిస్టు మహ్మద్ నరుూముద్దీన్ ఎన్‌కౌంటర్, నేర కార్యకలాపాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి, ఐజి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన షాద్‌నగర్ మిలీనియం కాలనీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నరుూం హతమైన సంగతి విదితమే. నరుూమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వివిధ చోట్ల జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు బహిర్గతమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నరుూం, అతని అనుచరుల నేర చరిత్రపై సమగ్ర దర్యాప్తుకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు డిజిపి తెలిపారు. సైబరాబాద్ అదనపు డిసిపి (క్రైమ్) బి శ్రీనివాసరెడ్డి, బేగంబజార్ సిఐ శ్రీ్ధర్, ఉప్పల్ ట్రాఫిక్ సిఐ ఎస్ సుధాకర్, వనపర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ హుస్సేన్, కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి సిఐ సామల వెంకటేష్, కోదాడ సిఐ పి మధుసూదన్‌రెడ్డి, ఆర్మూర్ సిఐ సీతారాం సిట్ సభ్యులుగా నియమించారు. నరుూంకు చెందిన ఇండ్లు, అనుచరుల ఇండ్లలో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న భూమి డాక్యుమెంట్లు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు వాటి పూర్వాపరాలపై సిట్ దర్యాప్తు చేస్తుందని డిజిపి ప్రకటించారు.