తెలంగాణ

చెరువుల నిర్వహణకు జియో ట్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: చెరువుల నిర్వహణను మరింత సరళీకృతం చేయడానికి జియో ట్యాగింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నట్టు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జియో ట్యాగింగ్ వ్యవస్థ వల్ల చెరువుల పూర్వ చరిత్ర, ప్రస్తుతస్థితి తెలుసుకోవడం సులువు అవుతుందని మంత్రి చెప్పారు. చెరువులకు గతంలో ఏ పేరు ఉన్నా జియో ట్యాగ్ ఏర్పాటు చేసిన తర్వాత వాటికి ప్రత్యేక కోడ్ ఉపయోగిస్తారన్నారు. ఈ కోడ్‌తో చెరువుల లొకేషన్ సహా ఇతర వివరాలు సులువుగా తెలుసుకునే వీలు ఉంటుందని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను శాటిలైట్ మ్యాప్‌లతో అనుసంధానం చేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 45 వేల చెరువులు ఉండగా 38 వేల చెరువుల రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. మిగతా 6 వేల చెరువులను గుర్తించడానికి జియో ట్యాగింగ్ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. తమ శాఖకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు అందినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం నాగ్‌సాన్ పల్లి తండాలో చెరువుకు గండిపడి మూడున్నర దశాబ్దాలు అవుతుందని ఎన్నారం యాదయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారన్నారు. ఆ మరుసటి రోజునే అధికారులు గండిపడిన చెరువును పరిశీలించి పనులు చేయడానికి సర్వే జరిపించినట్టు మంత్రి పేర్కొన్నారు.