తెలంగాణ

గుందిమళ్లలో కృష్ణమ్మ ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 10: కర్ణాటక, మహరాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాలు దాంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. ఆ రెండు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరగడంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు సైతం వరద నిరంతరంగా కొనసాగడం ఈ కారణంగా జూరాల నుండి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు 2 లక్షల క్యూసెక్కులకుపైగా వదిలారు. కృష్ణమ్మ వరద మహబూబ్‌నగర్ జిల్లాలో పెరగడంతో కృష్ణమ్మ పరవళ్లు పుష్కరఘాట్లకు తాకింది. అయితే కృష్ణా పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పుష్కర స్నానమాచరించేందుకు అలంపూర్ సమీపంలో గల గుందిమళ్ల పుష్కరఘాట్‌ను ఎంచుకున్నారు. అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. నది అడుగుభాగంలో నుండి దాదాపు 40 అడుగుల వెడల్పుతో 250 అడుగుల పొడవుతో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌కు కృష్ణమ్మ ప్రవాహం తాకింది. ముఖ్యమంత్రి కెసిఆర్ పుష్కర పుణ్యస్నానం చేసే ఘాట్ ప్రస్తుతం 9 మెట్లకుగాను 7 మెట్లు కృష్ణమ్మ ప్రవాహంతో నీట మునిగిపోయింది. ఎగువప్రాంతం నుండి కృష్ణమ్మ పరవళ్లు ఉధృతం అవుతుండడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యమంత్రి పుష్కర స్నానం చేసే ఘాట్ పూర్తిగా మునిగిపోతుందేమోనని ఆందోళనతో అలంపూర్ క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గల మరో క్యాతూర్ పుష్కర ఘాట్‌ను బుధవారం అధికారులు పరిశీలించారు. గత 32 ఏళ్ల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు గురైన గ్రామమే గుందిమళ్ల. ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో పునరావాస కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రమైన గుందిమళ్ల మరోసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా తెరపైకి వచ్చింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గుందిమళ్ల పుష్కరఘాట్‌లో కృష్ణా పుష్కర స్నానాన్ని చేసి కృష్ణమ్మకు హారతి ఇవ్వనున్నారు. అయితే భారీ ఏర్పాటు చేసినప్పటికీ కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామసర్పంచ్ సుజాతనాయుడు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

గోదారి తీరానికి పోటెత్తిన జనం
భద్రాచలం, ఆగస్టు 10: అంత్యపుష్కరాల్లో భాగంగా 11వ రోజు బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భద్రాచలం వద్ద గోదావరి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పుష్కర స్నానం చేశారు. ఇటీవలే మరణించిన మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు చితాభస్మాన్ని కుటుంబ సభ్యులు గోదావరిలో నిమజ్జనం చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా మహిళలు గంగానమ్మకు ప్రత్యేకంగా పూజలు చేసి ముత్తయిదువులకు వాయినాలు సమర్పించుకున్నారు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నిత్యకల్యాణాలతో పాటుగా దర్బారు సేవ వైభవంగా జరిగాయి.