తెలంగాణ

పంచలోహ విగ్రహాలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 10: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో 150 ఏళ్లనాటి ఉత్సవ మూర్తులు శ్రీ లక్ష్మీనారాయణస్వామి, శ్రీదేవి, భూదేవిల పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. ఒక కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే మూడు పంచలోహ విగ్రహాలను అపహరించుకువెళ్లారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దేవాలయం ప్రహరీ దూకి గర్భగుడి తాళం పగులగొట్టి మూడు పంచలోహ విగ్రహాలను అపహరించారు. బుధవారం ఉదయం పూజారి రవీంద్రచారి దేవాలయానికి వెళ్లగా గర్భగుడి తాళం పగులగొట్టి ద్వారాలు తెరిచి ఉన్నాయ. ఒక్కొక్క విగ్రహం 25 నుండి 30 కిలోల వరకు ఉంటుందని, మూడు పంచలోహ విగ్రహాల విలువ కోటిన్నర వరకు ఉంటుందని తెలిపారు. గర్భగుడి బయట నుండి గుడి లోపలికి చూసేసరికి ఉత్సవ మూర్తుల విగ్రహాలు కనిపించడం లేదని, ఈ విషయాన్ని బాలానగర్ పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.