తెలంగాణ

ఆమరణ దీక్షకు బయలుదేరిన జగ్గారెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 10: మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని, ఎన్ని అరెస్టులు చేయించినా వెనుకాడే ప్రసక్తే లేదని ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అరెస్టు చేయించినంత మాత్రాన మల్లన్నసాగర్ బాధితుల కోసం పోరాటాన్ని నిలిపివేసే ప్రసక్తి లేదని మరో రెండు మూడు రోజుల్లో కార్యాచరణను ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తానని పేర్కొన్నారు. నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్న కెసిఆర్, హరీశ్‌రావులను తెలంగాణ ప్రజలు ఎంత మాత్రం క్షమించరన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన సంగారెడ్డిలో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు జగ్గారెడ్డి ఉపక్రమించారు. పాతబస్టాండ్ వద్ద ఉన్న రాంమందిరం నుంచి అనుచరులతో ర్యాలీగా బయలుదేరిన జగ్గారెడ్డిని డిఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో పోలీసులు టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అడ్డగించి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాగా జగ్గారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ఐబి వద్ద మంగళవారం సాయంత్రం నుండే పోలీసులు మోహరించారు. బుధవారం ఉ. 10 గంటలకల్లా భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జగ్గారెడ్డి తన అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు