తెలంగాణ

అప్పుడే గంతులెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఆగస్టు 10: భూసేకరణకై జా రీ చేసిన జిఓ 123 రద్దును నిలుపుదల చేస్తూ జారీ చేసిన ఆదేశాలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గంతులు వేయవద్దని రైతు సంఘాల జెఎసి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్ అండ్ బి అతిధి గృహంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత జిఓ 123 రద్దు చేస్తూ రాష్ట్ర హైకో ర్టు తీర్పునివ్వడం, అనంతరం ప్రభుత్వం దానిని డివిజన్ బెంచ్‌లో సవాలు చేస్తే స్టే ఇచ్చిందని, దీంతో హరీశ్‌రావు విపక్షాలు, రైతు సంఘాల నాయకులపై విరుచుకుపడటాన్ని ప్రస్తావించగా అది స్టే అని అర్ధం చేసుకోవాలని ఆయన అన్నా రు. జిఓ 123 లోపభూయిష్టంగా ఉందని, రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
జిఓ కాకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుండి సేకరించిన భూములకు పరిహారం చెల్లిస్తున్నామని తెలియపరుస్తూ హైకోర్టును మభ్యపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
లక్షల కోట్లు ఎగ్గొట్టే వారిని పాలకులు ఏమనరు...
ప్రభుత్వానికి, ప్రభుత్వరంగ బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టిన పెట్టుబడిదారులపై చర్యలుండవని, రైతుల విషయానికి వస్తే సేకరించిన భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వరని, అప్పులు బలవంతంగా వసూలు చేస్తారని రైతు సంఘాల జెఎసి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. గత తొమ్మిది రోజులుగా ఇక్కడి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టేల్‌పాండ్ భూనిర్వాసితులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ దేశంలో అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు.