తెలంగాణ

తెలంగాణ సాంస్కృతిక సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యే కృష్ణా పుష్కరాల సందర్భంగా భారతీయ వారసత్వం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా సాంస్కృతిక సంబురాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. గురువారం సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలలో భారీ ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలను ఆదర్శంగా తీసుకుని కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు సాంస్కృతిక వికాసం కల్పించాలన్న ఉద్దేశంతో సాంస్కృతిక సంబురాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీని కోసం 12వేల మంది కళాకారుల సేవలను ఉపయోగించుకుంటున్నట్టు వివరించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని బీచ్‌పల్లి, రంగాపూర్, సోమశిల, కష్ణాబ్రిడ్జి జంక్షన్, పసుపుల, ఆలంపూర్, వాడపల్లి, మట్టంపల్లి, నాగార్జున సాగర్‌ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి సాంస్కృతిక సంబురాలు నిర్వహించనున్నట్టు చందూలాల్ తెలిపారు.
శుక్రవారం ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి పది గంటల వరకు సాంస్కృతిక సంబురాలు నిర్వహిస్తారు. భక్తి, ఆథ్యాత్మికతకు సంబంధించిన కార్యక్రమాలు, భజనలు, ధార్మిక ప్రవచనాలు, చిందు యక్షగానం, ఒగ్గు కథ, శాస్ర్తియ సంగీతం, పద్య పౌరాణిక నాటకాలను ప్రదర్శించనున్నట్టు మంత్రి తెలిపారు. దీని కోసం దాదాపు కోటి రూపాయలు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ, పౌర సంబంధాల శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సాంస్కృతిక సంబురాలను భక్తులు వీక్షించి ఆస్వాధించాలని చందూలాల్ కోరారు.
సమావేశంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సిఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.