ఆంధ్రప్రదేశ్‌

పులకించిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 12:కృష్ణా నదీతీరం పవిత్ర పుష్కర స్నానాలతో పులకించింది. పనె్నండేళ్ల కోసారి వచ్చే పుష్కరాల తొలి రోజైన శుక్రవారం లక్షలాదిగా జనం తరలి వచ్చి పుణ్యస్నానాలాచరించారు. సంప్రదాయం, భక్తిపారవశ్యం అడుగడుగునా అన్ని ఘాట్లలోనూ గోచరించాయి. పవిత్ర మంత్రోచ్ఛరణలతో అన్ని ఘాట్లూ దివ్యానుభూతిని కలిగించాయి. తెల్లవారు జామునే దుర్ఘా ఘాట్ వద్ద సతీసమేతంగా స్నానమాచరించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానాలకు శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా సీతానగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి పవిత్ర కృష్ణా నదిలో స్నానమాచరించారు. ఈసందర్భంగా ఆయన కృష్ణమ్మకు, సూర్య భగవానునికి హారతి ఇచ్చారు. అలాగే గుంటూరు జిల్లా అమరావతి మండలం జ్ఞాన బుద్ధ ఘాట్ వద్ద మంత్రి విశ్వయోగి విశ్వంజీ, మంత్రి పత్తిపాటి పుల్లారావు పవిత్ర స్నానాలు ఆచరించారు. పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పుష్కర స్నానాలు చేసి, కృష్ణమ్మకు హారతి ఇచ్చారు. పున్నమి ఘాట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానాలు చేశారు. పుష్కర స్నానం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు చేరుకుని సుమారు మూడు గంటలపాటు పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ ఘాట్‌లలో పుష్కర స్నానాలను ఆచరించారు. మొత్తం మీద చెదురు మదురు సంఘటనలు మినహా పుష్కర స్నానాలు సవ్యంగా జరిగాయనే చెప్పుకోవచ్చు. కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నాలుగు లక్షల 51వేల 569 మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారులు ప్రకటించారు. విజయవాడలో 2,51,123 మంది, విజయవాడ రూరల్ జిల్లాలో 59,060 మంది, గుంటూరు జిల్లాలో 63,513 మంది, గుంటూరు రూరల్ జిల్లాలో 39,516 మంది, కర్నూలు జిల్లాలో 38,313 భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా, విజయవాడ పద్మావతి ఘాట్‌లో ఐదేళ్ళ కిరణ్‌కుమార్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అలాగే పున్నమి ఘాట్‌లో విశాఖ జిల్లా మాడుగులకు చెందిన వీర దొరబాబు దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గార్లపాడు కాలువ వద్ద సాగర్ కాలువలో పుష్కర స్నానానికి వెళ్లిన కనె్నగంటి చక్రథర్ ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయాడు.
ఇదిలా ఉండగా కృష్ణా పుష్కరాల్లో భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విస్తృతంగా ఘాట్‌లను నిర్మించింది. అయితే చాలా ఘాట్‌లలో నీరు లేకపోవడంతో భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. గుంటూరు జిల్లాలో 71 ఘాట్‌లు ఉండగా 30 ఘాట్‌లలో నీరు లేకపోవడం గమనార్హం. అలాగే కృష్ణా జిల్లాల్లో మచిలీపట్నం మండలం నాగులేరు వద్ద నిర్మించిన ఘాట్‌లో నీరు లేకపోవడంతో డ్రమ్ములతో నీటిని తెచ్చి పోసే పరిస్థితి ఏర్పడింది. ఇదే జిల్లాలోని దాములూరు, పొటికలపూడి, జూపూడితోపాటు అనేక ప్రాంతాల్లో ఘాట్‌ల్లో నీరు లేకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు ప్రత్యామ్నాయ ఘాట్‌లకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ప్రకాశం బ్యారేజ్ కింద నిర్మించిన పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లో మోకాలు లోతు నీటిని విడుదల చేశారు. ఈ నీరు కూడా మురికిమయంగా కనిపించింది. మూడు గంటలకోసారి నీటిని కిందికి విడుదల చేశారు. అప్పటికే నీరు మురికైపోయింది. విధిలేని పరిస్థితుల్లో భక్తులు ఇక్కడ స్నానాలు చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా పద్మావతి ఘాట్‌లో సగ భాగం పనులు పూర్తి కాలేదు. దీంతో ఈ ఘాట్‌లోకి భక్తులను అనుమతించలేదు. అలాగే గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో జనం అస్సలు కనిపించలేదు. దీనికి పోలీసుల ఆంక్షలే ప్రధాన కారణం.

చిత్రం.. విజయవాడలోని దుర్గా ఘాట్‌లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సమక్షంలో పూజలు నిర్వహిస్తున్న చంద్రబాబు దంపతులు. దుర్గా ఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు