ఆంధ్రప్రదేశ్‌

23 తరువాత అమరావతికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సచివాలయాన్ని తరలించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే శాఖాధిపతుల కార్యాలయాలు అన్నీ హైదరాబాద్ నుండి గుంటూరు, విజయవాడ, ఇబ్రహీంపట్నం పరిసరాలకు తరలివెళ్లాయి. సచివాలయంలో కూడా వివిధ విభాగాలు ఒకేచోట కేంద్రీకృతం చేయడానికి వీలు లేకపోవడంతో కొన్ని శాఖలు స్వతంత్రంగా భవనాలను తీసుకుని కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ, హోం శాఖకు చెందిన సచివాలయ కార్యాలయాలు తాజాగా సిఆర్‌డిఎ నిర్మించిన కొత్త సచివాలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇంత కాలం భవనాల నిర్మాణం పూర్తి కాలేదని, నిర్మించిన భవనాల్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నాయని, పనులు పూర్తి కాలేదని, ఇరుకుగా ఉన్నాయని, పనిచేసుకునేందుకు అనువుగా లేవని ఇలా రకరకాల కారణాలు, సాకులు చూపిన సిబ్బంది తాజాగా మంచి రోజులు లేవనే పేరుతో కొంతకాలం గడిపేశారు. పుష్కరాల ముందు కార్యాలయాల మార్పిడి మంచిది కాదని పండితులు వారించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చూసీ చూడనట్టు ఊరుకున్నారు. తాజాగా పుష్కరాలు పూర్తికాగానే కార్యాలయాల తరలింపు అంశంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని విజయవాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ సైతం వెల్లడించారు. ఇప్పటికే ఆరు లక్షల చదరపు అడుగుల భవనాల నిర్మాణం పూర్తయిందని, అన్ని సౌకర్యాలను కల్పించామని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టును డిజైన్ చేయడం మినహా ఏ రకమైన పనుల్లోనూ సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయలేదని కూడా మంత్రి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం మాత్రం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చేపడతామని, అందులో సింగపూర్ ప్రభుత్వం సైతం అంతర్జాతీయ బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన టెండర్లను త్వరలో తెరుస్తామని, గతంలో ఈ తరహా పనుల అనుభవం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పడం ద్వారా సింగపూర్ ప్రభుత్వానికే బాధ్యత అప్పగించనున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. అమరావతి చుట్టూ 9 నగరాలను ఏర్పాటు చేస్తారు. అందులో ఒకటి పరిపాలనా నగరం, న్యాయసంస్థల నగరం, క్రీడా నగరం, ఆర్థిక నగరం, జ్ఞాన సంపన్న నగరం, ఎలక్ట్రానిక్ సిటీ, ఆరోగ్య నగరం, పర్యాటక నగరం పేరిట 9 నగరాలను ఏర్పాటు చేసి, ఆయా రంగాలకు ఆయా ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేవలం పరిపాలనకే పరిమితం చేయకుండా ప్రజలు సైతం నివాసం ఉండేలా చూస్తూనే మరో పక్క ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.