రాష్ట్రీయం

పాఠశాల పైకప్పు కూలి విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంకొండ, నవంబరు 25: చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన గుర్రంకొండలో బుధవారం పాఠశాల పైకప్పు కూలడంతో ఒక చిన్నారి అప్సర(7) శిథిలాల కిందపడి మృతిచెందింది. ఈప్రమాదంలో మరో 14మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. గుర్రంకొండలో గత ఏడాది ఇండియన్ పబ్లిక్‌స్కూల్ పేరిట ఓ ప్రైవేటు పాఠశాల ప్రారంభమైంది. ఈ భవనం పాతకాలం నాటి భవంతిలో ప్రారంభించారు. ఆ పాఠశాలలో 210 మంది విద్యార్థులు 1 నుంచి 5 తరగతులు చదువుకుంటున్నారు.
ఆభవనంలో ఒక గది ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. బుధవారం మధ్యాహ్నం ఒకటన్నర గంటకు పాఠశాలకు క్యారీయర్ తెచ్చుకున్న చిన్నారులు ఆ గదిలో భోజనం చేస్తుండగా పై కప్పు పెద్ద శబ్దంతో చిన్నారులపై పడింది. ఆశబ్ధం విని సమీపంలోని వారు కేకలువేశారు. దీంతో ఊరంతా పాఠశాల వద్దకు పరుగులు తీసి విద్యార్థులను శిథిలాల నుండి బయటకు తీశారు. 108కు సమాచారం అందించారు. వాయల్పాడు నుండి 108 వాహనం పాఠశాలకు చేరుకుని చిన్నారులను మదనపల్లె వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులను వారి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఆ సమయంలో విరామం కాబట్టి సరిపోయింది. లేకుంటే 31 మంది విద్యార్థులు పరిస్థితి విషమంగా మారి ఉండేదని అంటున్నారు. ఆ సమయంలో టీచర్లు ఇళ్లకు వెళ్లినవారు ఈ సంఘటన తెలిసి ఎవ్వరూ రాలేదు. పాఠశాల కరస్పాండెంట్ పరారయ్యాడు. మదనపల్లె సబ్‌కలెక్టర్ మల్లికార్జున, డిఎస్‌పి రాజేంద్రప్రసాద్ నాయుడు, సిఐ శ్రీ్ధర్‌నాయుడు, ఎస్‌ఐ రామక్రిష్ణా, మండల తహశీల్దార్ ధర్మయ్య, ఇన్‌చార్జ్ మండల విద్యాశాఖాదికారి ఈశ్వరయ్య తదితరులు చేరుకున్నారు. సబ్‌కలెక్టర్ మల్లికార్జున్ ఈ పాఠశాలపై పూర్తి వివరాలను ఇవ్వలేకపోవడంతో ఇన్‌చార్జి ఎంఇఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా భవనం శిధిలమైందని ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేయాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.