రాష్ట్రీయం

స్పీకర్‌పై అవిశ్వాసం ప్రచారం కోసమైనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించుకునేంత బలం లేదని తెలిసినా ఆ పార్టీ ధైర్యం చేసింది. అందునా అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమకు బలం లేదు కాబట్టి తీర్మానం ప్రవేశపెట్టినా గెలువలేం అని అంగీకరించారు. కాగా మంగళవారం ఆ పార్టీ శాసనసభాపక్షం సమావేశంలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాలనే నిర్ణయించారు. నోటీసు కూడా స్పీకర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటీసు ఇవ్వడం ద్వారా ప్రచార ఆర్భాటం తప్ప ఉపయోగపడేది, జరిగేది ఏమీ ఉండదు. ఈ విషయం ఆ పార్టీకీ తెలుసు. ఇలాఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్టు?, సమావేశాలు నిరవధికంగా వాయిదాపడిన తర్వాత నోటీసు ఇవ్వవచ్చా?, అలా ఇవ్వాలని నిర్ణయించి ఆ పార్టీ తప్పిదం చేయబోతుందా?..ఇలా అనేకానేక అనుమానాలు, సందేహాలు అన్ని పార్టీల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై కొంత లోతుగా అధ్యయనం చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వాన్ని, ఇటు స్పీకర్‌ను ఇరకాటంలో పెట్టేందుకే ఈ వ్యూహ రచన చేసిందని స్పష్టమవుతున్నది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే స్పీకర్‌కు నోటీసు ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు. ఎవరైనా ఒక సభ్యుడు ఎప్పుడైనా నోటీసు ఇవ్వవచ్చు. సదరు సభ్యుడు ఇచ్చిన నోటీసును స్పీకర్ 14 రోజుల తర్వాత సభలో ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత సభ్యుల ఆమోదం తీసుకుని 10 రోజుల్లోగా సభలో చర్చ, ఓటింగ్ నిర్వహించాలి. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలా? అనే అంశంపై స్పీకర్ సభ అభిప్రాయాన్ని కోరినప్పుడు 50కి తక్కువ కాకుండా సభ్యులు తమ మద్దతు ప్రకటించాలి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆలోచించే ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను ఇరకాటంలో పెట్టేందుకు బుధవారం ఉదయం 10.30 గంటలకు స్పీకర్‌కు నోటీసు ఇచ్చే ఆలోచనలో ఉన్నది.కానీ ఈ లోగా అసెంబ్లీని గవర్నర్ ప్రొరోగ్ చేస్తే ఆ నోటీసును స్పీకర్ పరిశీలించాల్సిన అవసరం ఉండదు.అవిశ్వాస తీర్మానం ఎప్పుడైనా ఇవ్వవచ్చు. అయితే ఆ నోటీసు అన్ని విధాలా సక్రమంగా ఉందని స్పీకర్ భావిస్తేనే సభ ముందు పెడతారు. లేకపోతే తానే తిరస్కరించవచ్చు. ఇప్పుడు వైకాపా ఇచ్చే నోటీసుపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారోనని అన్ని పార్టీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

31 వరకూ
డీసెట్ అడ్మిషన్లు

హైదరాబాద్, డిసెంబర్ 22: డీసెట్ రెండో విడత కౌనె్సలింగ్‌లో సీట్ల కేటాయింపు 24 నుండి 28 వరకూ చేపడతామని సెట్ కో కన్వీనర్ పి పార్వతి తెలిపారు. అభ్యర్ధులకు 29న కాలేజీలు కేటాయిస్తామని, సర్ట్ఫికేట్ల పరిశీలన 30న జరుగుతుందని చెప్పారు. అభ్యర్ధులు 31న సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు.