ఆంధ్రప్రదేశ్‌

హోదాపై త్వరలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు16: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను రెండు వారాల్లో పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. చట్టంలో పొందుపరిచిన హామీలలో అమలుకాని వాటిపైనా, రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలపైనా సత్వర చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనాచౌదరి మంగళవారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో భేటీ అయ్యారు. వారి మధ్య గంటకు పైగా చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీ అయిన హోంమంత్రిత్వ శాఖకు చట్టంలో పేర్కొన్న హమీలను నెరవేర్చే బాధ్యత ఉన్నదని హోం మంత్రి దృష్టికి వెంకయ్య తీసుకొచ్చారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను సత్వరం పరిష్కరించాలని హోం మంత్రిని కోరామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రి జైట్లీని కోరినట్లు చెప్పారు.ప్రత్యేక హోదాపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జైట్లీ చెప్పినట్లు వెంకయ్య వెల్లడించారు. చట్టంలో పేర్కొన్న అంశాల అమలు ఎంతవరకూ వచ్చిందో ఈ సమావేశంలో సమీక్షించినట్టు చెప్పారు. హోం శాఖ కార్యదర్శి, సయుక్త కార్యదర్శులను పిలిచి అంశాలవారీగా చర్చించినట్లు చెప్పారు. రెండు వారాల్లో విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరిస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్లు వెంకయ్య చెప్పారు. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించాల్సిన సంస్థలు, పరిష్కారం కాని అంశాలపై కేంద్ర హోం శాఖ నుంచి లేఖలు సంబంధిత శాఖలకు వెళ్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం కూడా చర్చించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ విషయమై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అధ్యయనం చేస్తామన్నారు. అలాగే నెలరోజుల్లో పెట్రోలియం విశ్యవిద్యాలయం ఏర్పాటు అయ్యేలా చూడాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరినట్లు చెప్పారు.