రాష్ట్రీయం

మండలిలో టిటిడి దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఐదోరోజైన మంగళవారం దుమారం చేలరెగింది.టిటిడి అధికారుల వ్యవహర శైలి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోందని అన్ని పార్టీల సభ్యులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎపీలో నిరుద్యోగ అంశంపై పిడిఎఫ్ సభ్యులు బి.నాగేశ్వరరావు, అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై కాంగ్రెస్ సభ్యులు సి.రామచంద్రయ్య, తమిళనాడులో తెలు గు భాష పరిరక్షణ అంశంపై సిపిఐ సభ్యుడు పిజె చంద్రశేఖరరావుతో పాటు పలువురు ఇతర అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టారు. చైర్మన్ చక్రపాణి చర్చకు కాకుండా మాట్లాడేందుకు అవకశామిచ్చారు. మంత్రి పల్లె రఘనాథ్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితో మాట్లాడామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షా నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
టిటిడి అదికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నరని దీని వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతోందని సభ్యులు సభలో ముక్తకంఠంతో ఆరోపించారు. ఈ అంశంపై దాదాపు గంటపాటు వాడివేడిగా చర్చ సాగింది. మండలి డిప్యూటి చైర్మన్ వెంకట సతీష్‌రెడ్డి మాట్లాడుతూ దర్శనం కోసం తిరుపతికి వెళ్తే తనను మూడు గంటల పాటు కూర్చోబెట్టి అధికారులు అవమాన పర్చారని ఆరోపించారు. అధికార పార్టీ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి, శాసన సభ సభ్యులకు ముఖ్య కార్యదర్శి హోదా ఉన్నప్పటికీ టిటిడి అధికారులు అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న చైర్మన్ చక్రపాణి జోక్యం చేసుకుని టిటిడి అంశాన్ని ప్రివిలేజ్ కమిటికి అప్పగించి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని, దాదాపు రూ.120.97 కోట్ల వ్యయంతో అనేక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. గందరగోళ పరిస్థితుల మధ్య సభ వాయిదా పడి 11.35 గంటలకు మళ్లీ సమావేశమైంది. కృష్ణా జలాలపై దాదాపు 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. దీనితో తమ వాదనను విననందుకు సభ నుండి ప్రతిపక్ష పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కృష్ణా జలాలపై చర్చించాలని బిఎసిలో నిర్ణయించినప్పటికి సమయాభావం వల్ల ఎజెండాలో చేర్చలేదన్నారు. దీంతో సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాయలసీమ ప్రయోజనాలను కాపాడుతామని, రాయలసీమకు అన్యాయం జరగదని తెలిపారు. అనంతరం చర్చకు వచ్చిన ఎనిమిది బిల్లులు ఎపిలో విద్యుత్ సుంకం బిల్లు, వౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల క్రమబద్దీకరణ, మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, తీర ప్రాంత బిల్లు, విలువ ఆధారిత (3వ సవరణ బిల్లు), స్వదేశంలో తయారైన విదేశీ మద్యం, వ్యాపార క్రమబద్దీకరణ, మనీల్యాండరింగ్ బిల్లులను శాసనమండలిలో ఆమోదం పొందినట్లు సభా చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. తరువాత రాష్ట్రం లో కరువు, నీటిపారుదల రంగంపై సుదీర్ఘ చర్చ జరిగింది. సాయంత్రం వరకు కోనసాగిన సభను నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ చక్రపాణి ప్రకటించారు.