రాష్ట్రీయం

పల్లెల్లో అంతర్జాతీయ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రపంచవ్యాప్తంగా వైద్య చికిత్సల్లో అమలుచేస్తన్న ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా అందించడానికి ఒక అంతర్జాతీయ బృందం ముందుకు వచ్చింది. దీనిని ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో అమలుచేయాలని మధ్యాహ్నం సిఎం చంద్రబాబునాయుడు మెక్సికో బృందానికి సూచించారు. రాష్టశ్రాసనసభలో తన కార్యాలయంలో కలిసిన న్యూ మెక్సికో వర్శిటీ వైద్య నిపుణుల బృందంతో సిఎం మాట్లాడారు. ఎకో ఇండియా, కరుణ ట్రస్టు ప్రతినిధులతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తామని ఈ బృందం సిఎంకు తెలిపింది. రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు సిఎం ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి పల్లెల్లో పనిచేయాలని అనుకోవడం మంచిదని అన్నారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు మన రాష్ట్రంలో 12 వేల మంది నర్సులకు దశల వారీగా శిక్షణ ఇస్తారని, ఈ మేరకు మెక్సికో యూనివర్శిటీ, ఎకో, కరుణ ట్రస్టు లు సంయుక్తం ఒక అవగాహనకు వచ్చాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా ముందు కంటి శస్త్ర చికిత్సలు, దంత వైద్యం, మానసిక వైద్యం, ప్రాథమిక ఆరోగ్య విభాగాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
సిఎంను కలిసిన సిఐఐ ప్రతినిధులు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలైనన్ని అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సిఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో కలిసిన సిఐఐ ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చే నెల 10 నుండి 12 వరకూ విశాఖలో జరిగే పార్టునర్‌షిప్ సదస్సు ఏర్పాట్లుపై చర్చించారు. ఈ సమ్మిట్‌ను ప్రారంభించాల్సిందిగా భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరామని సిఎం వారికి చెప్పారు.
పోస్టర్ విడుదల
చంద్రన్న సంక్రాంతి కానుక , క్రిస్మస్ కానుక పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు. కాగా జనవరి 9, 10 తేదీల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ పోస్టర్‌నూ ముఖ్యమంత్రి మంగళవారం నాడు ఆవిష్కరించారు.