రాష్ట్రీయం

కొణతాలకు బాబు పచ్చజెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 22: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కొణతాల తన క్యాడర్‌తో సమావేశం ఏర్పాటు చేసుకుని, టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేయడమే తరువాయి. ఆ సమావేశం కూడా ఈనెలాఖరులో ఉంటుందని గండి బాబ్జీ చెప్పారు. కొణతాల 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి, ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆయన పరాజయంపాలయ్యారు. కొణతాల ఓటమిపాలైనప్పటికీ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి జిల్లా బాధ్యతలను ఆయనకే అప్పగించారు. రాజశేఖరరెడ్డికి కొణతాల ముఖ్య అనుచరునిగా ఉండేవారు. వైఎస్‌ఆర్ మరణం తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలబడ్డారు. జగన్ స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కొణతాల కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ పోటీ చేయకుండా, ఆయన సోదరుడు కొణతాల రఘుబాబును అనకాపల్లి నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీలో నిలబెట్టగా ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జగన్‌తో సంబంధాలు చెడిపోవడంతో కొణతాల వైకాపాను విడిచి బయటకు వచ్చేశారు. సుమారు సంవత్సర కాలంగా కొణతాల వౌనంగా ఉన్నారు. ఒక సందర్భంలో ఆయన బిజెపిలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కొణతాల రాజకీయ భవిష్యత్ ఎటూ తేల్చుకోకపోవడంతో, ఆయన అనుచరులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆయన ప్రధాన అనుచరుడు గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ కొణతాలపై వత్తిడి తెచ్చారు. ఈ విషయమై కొణతాల చాలా కాలం యోచించారు. ఈ నేపథ్యంలోనే కొణతాలను తమ పార్టీలోకి రావల్సిందిగా చంద్రబాబు వర్తమానం పంపించారు. సుదీర్ఘ కాలం ఆలోచించిన కొణతాల ఎట్టకేలకు మంగళవారం చంద్రబాబును కలిసి తన నిర్ణయాన్ని తెలియచేశారు. కొణతాలను, గండి బాబ్జీని మంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. వీరితోపాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు కూడా ఉన్నారు.