రాష్ట్రీయం

అలరించిన సాయం సంధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: సాయంత్రం వేళ, అందరూ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కవుల చమత్కారాలు, దేశభక్తి గీతాలు ఆలంకించారు. ఉత్కంఠ భరితమైన మ్యాజిక్ షోను వీక్షించారు. ఇదంతా కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అధ్యక్షతన నగరంలోని హోటల్ మ్యారియట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో భాగంగా బిజెపి రాష్ట్ర శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ముఖ్య భూమిక పోషించారు. సుమారు రెండున్నర గంటల పాటు కవులు, కళాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. తొలుత కీరవాణి తన బృందంతో ‘పుణ్య భూమి నా దేశం..’ గీతాన్ని ఆలంపించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. నాగఫణి శర్మ తన కుమార్తె సుఖప్రియతో కలిసి ‘జననీ..’ అంటూ ఆలపించిన గీతం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. కవి యాకుబ్ ‘తహ-తహ’ అనే కవిత చదివి వినిపించారు. సినీ నటుడు తణికెళ్ల భరణి ‘మా అమ్మకు డెబ్బయ్ ఏళ్ళు..’ కవిత వినిపించారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎస్వీ సత్యనారాయణ కూడా కవిత వినిపించారు. రచయిత, ప్రముఖ కవి ముదిగొండ శివప్రసాద్ ప్రసాద్ ‘నా మనసాయేగా, భూమి నాకు తల్లి..’ అనే కవిత వినిపించారు. ఈ దేశం నాది అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పాలని అన్నారు. తెలుగు విశ్వ విద్యాలయం మాజీ వైస్‌చాన్సలర్ ఆచార్య ఎన్. గోపి ‘అతడు రోజూ కనిపిస్తాడు..’ అనే కవిత వినిపించారు. ఎండ్ల సుధాకర్ కవిత వినిపించారు. ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ‘నేను మీ అమ్మను..’ అనే కవిత చెప్పారు. రచయిత, గాయకుడు గంగాధర శాస్ర్తీ ‘పాడవోయి భారతీయుడా’ అనే గీతాన్ని ఆలపించారు. పలు హిట్ సినిమాలు తీసిన భారవి ప్రసంగిస్తూ గాంధీజీ బాల్యంపై ఏడేళ్ళుగా పరిశోధన చేసి సినిమా రూపొందించామని, ఇది ప్రపంచంలోని యువతరానికి మార్గదర్శకం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రామాచారి బృందం దేశ భక్తిగీతాన్ని ఆలపించారు. కవి సిరాశ్రీ, మాలకొండారెడ్డి కవితలు చెప్పగా, ఖాన్ దేశ భక్తిగీతాన్ని పాడి సభికుల మన్ననలు పొందారు. చివరగా మెజీషియన్ సామల వేణు మ్యాజిక్ షో చేసి అందరినీ ఆకర్షించారు. ఇలాఉండగా స్వాతంత్య్ర సమరయోధులు పసగండి వీరాస్వామి, టి.వి. నారాయణ, బి.ఎన్. రెడ్డి, కెవిరెడ్డి, ఎన్. రామచంద్రారెడ్డి, లక్ష్మీనారాయణ, సుఖ్‌దేవ్ ఆర్య, మల్లమ్మను కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో శుక్రవారం బిజెపి నిర్వహించిన స్వాతంత్య్ర సప్తతి-
సాయం సంధ్య కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు