రాష్ట్రీయం

దుష్టశక్తులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20 : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం సచివాలయంలోని ‘సి’ బ్లాకులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దుష్టశక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. తప్పు ఎవరు చేసినా సహించేది లేదని, నేరం చేసిన వారు ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నయింకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు కెసిఆర్ సమాధానం చెబుతూ, నయిం బాధితులకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తామన్నారు. ఎవరిభూములనైనా అక్రమంగా, బలవంతంగా నయిం లాక్కొని ఉంటే, ఆ భూములను తిరిగి ఇప్పిస్తామన్నారు. నయింతో రాజకీయనేతలు, అధికారులు ఎవరికి సంబంధం ఉన్నప్పటికీ, తాము సహించబోమని స్పష్టం చేశారు. నయిం కేసుకు సంబంధించి ఏరోజుఎలాంటి పురోగతి ఉందో అదేరోజు సాయంత్రం మీడియాకు తెలియచేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీని వల్ల మీడియా కట్టుకథలు అల్లాల్సిన అవసరం ఉండదన్నారు. జోనల్ విధానం ప్రసుతం తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి, అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల్లో జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి ఉద్యోగులంటూ ఉంటే సరిపోతుందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ విధానం అవసరం ఉండేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. దీని వల్ల ఉద్యోగుల సీనియారిటికీ ఎలాంటి భంగం వాటిల్లకుండా చూస్తామని, ఇందులో భాగంగా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించామని గుర్తు చేశారు.