రాష్ట్రీయం

1 నుంచి విజయవాడలో పుస్తక ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 22: రెండున్నర దశాబ్దాలు పైగా పుస్తక పఠనాభిలాషను పెంపొందిస్తూ పుస్తక పఠనావశ్యకతను తెలియజేసేందుకు క్రమం తప్పకుండా ఏటా నూతన సంవత్సరం ఆరంభంలో మొదటి 11 రోజులపాటు జరిగే విజయవాడ పుస్తక మహోత్సవం 2016 జనవరి 1న ప్రారంభం కానుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపురేఖలు దిద్దుకుంటున్న విజయవాడలో ఈ 27వ పుస్తక మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకందామని ముఖ్యంగా పబ్లిషర్లు ఆశిస్తే దానికి భిన్నంగా జరుగుతోంది. ఏనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు కదా కనీసం ప్రజా ప్రతినిధుల నుంచి నయాపైసా సహకారం లేకపోయినా తొలిసారిగా ఈ ఏడాది అవాంతరాలు ఎదురవుతుండటంతో అగమ్య గోచర స్థితి నెలకొన్నట్లయింది. ఎప్పటిలానే నగరం నడిబొడ్డులోని స్వరాజ్య మైదానంలో 27వ పుస్తక మహోత్సవానికి అనుమతి కోరుతూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ మే ఐదో తేదీ దరఖాస్తు చేసుకుంది. ఆశ్చర్యకరం ఏమిటంటే నేటి వరకు అధికారికంగా నో అబ్జెక్షన్ సర్ట్ఫికేట్ (ఎన్‌వోసి) రాలేదు. పలు దఫాలుగా తిరగ్గా కలెక్టర్ నుంచి వౌఖికంగా అనుమతి లభించింది. దీంతో ఏర్పాట్లు చేయడంలో అంతులేని జాప్యం జరుగుతూ వచ్చింది. సమీపంలో సిఎం క్యాంప్ కార్యాలయం ఉన్నందున సెక్యూరిటీ జోన్స్‌లో స్వరాజ్య మైదానంలో మూడో వంతు స్థలాన్ని కేటాయించగలమని చెబుతున్నారు. గత ఏడాది 389 స్టాల్స్ ఏర్పాటు కాగా ఈ దఫా 230కి మించి ఏర్పాటు చేసే అవకాశం కన్పించడం లేదు. పైగా ఒక్కో స్టాల్ సైజ్‌ను కూడా తగ్గిస్తున్నారు. తగిన సమయం లేకపోడంతో ఈ దఫా విద్యార్థినీ విద్యార్థులకు వివిధ అంశాలపై రకరకాల పోటీలు ఏర్పాటు చేసే ఆస్కారం కూడా కన్పించడం లేదు. పుస్తక మహోత్సవం అంటే కేవలం పబ్లిషర్ల కోసమేనన్న ప్రచారం వాస్తవం కాదని, ప్రజల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించాలన్న అభిలాష మాత్రమే తమలో ఉందని సొసైటీ మాజీ కార్యదర్శి వెంకట నారాయణ చెబుతున్నారు.
నగరంలో తొలిసారిగా 1989లో నేషనల్ బుక్ ట్రస్ట్ మొదటి పుస్తక మహోత్సవాన్ని నిర్వహించగా, దాని ఉత్తేజంతో పబ్లిషర్లు కలిసి సొసైటీగా ఏర్పడి ఇప్పటివరకు 26 పుస్తక మహోత్సవాలను దిగ్విజయంగా జరిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లో విశాలమైన ప్రదేశాన్ని ఉచితంగా అందజేస్తుంటే విజయవాడలో నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి వస్తోంది.