రాష్ట్రీయం

గండికోట.. గుండె కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 22: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన గండికోట ప్రాజెక్టు నిర్మాణ పనులు అడుగు ముందుకు, మూడడుగుల వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు 3వేల 300 కోట్లు విడుదల చేశారు. తొమ్మిదేళ్లుగా జలయజ్ఞం పనులు నత్తనడకన సాగుతుండగా, కాంట్రాక్టర్లు విడుదలైన సొమ్ము ఎప్పటికప్పుడు కాకిలెక్కలు చెబుతూ ఏటికేటికీ ప్రాజెక్టు ఎస్టిమేషన్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. పనుల పురోగతిలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలో పనులు పూర్తిచేసి గండికోటకు నీరు ఇస్తామని అధికారులు ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తిచేసేందుకు రూ.8కోట్లు అవసరమని, ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెంచాలని, స్టీల్,సిమెంట్ ధరలు పెరిగాయని కాంట్రాక్టర్లు కాకమ్మ కబుర్లు చెబుతూ పనులు ముందుకు సాగనీయడం లేదు. గండికోట ప్రాజెక్టుకు నీరు అందాలంటే అవుకు జలాశయం నుంచి యూనిట్ -1 కింద పనులు ముందుగా పూర్తిచేయాల్సి ఉంది. అలాగే గండికోట సొరంగం 5.5 కి.మీ. మార్గంలో లైనింగ్ పనులు పూర్తి చేయాల్సివుంది. ఈ పనులకు రూ.27 కోట్లతో పూర్తిచేయాల్సి ఉండగా, నిధులలేమి సాకుతో అసంపూర్తిగా పూర్తిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సొరంగం పనులు పూర్తి చేస్తామని జలవనరులశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు పనులు ముందుకు కదల్లేదు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్‌కు 130కి.మీ.మేర పొడవునా నీరు తీసుకురావడానికి ప్రధాన కాలువ పనులు కూడా అసంపూర్తిగానే మిగిలాయి. పోతిరెడ్డిపాడు నుంచి 1.5టిఎంసిల నీరు అవుకు రిజర్వాయర్‌కుచేరి తద్వారా గండికోటకు నీరుచేరాల్సివుంది. ప్రధానకాలువ తవ్వకానికి ఇటీవలే కేంద్ర పర్యావరణ అనుమతులు లభించాయి. అలాగే జికెఎల్‌ఐ పథకం (ఎత్తిపోతల) పనులు పూర్తయినా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పంపేందుకు వీలుపడలేదు. కొండాపురం సమీపంలో ఎల్‌ఐ-1, ఎల్‌ఐ -2, ఎల్‌ఐ -3, ఎల్‌ఐ -4 పథకాలను రూ.211 కోట్లతో (ఎత్తిపోతల) పూర్తిచేయాల్సివుంది. ఎత్తిపోతల పనులు పూర్తయినట్లయితే 59వేల 400 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా భూసేకరణ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాజెక్టుపనులు నత్తనడకన సాగుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదిలాఉండగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు , జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు గండికోటకు నీరు తేవడానికి దృష్టిసారించారు. కర్నూలు జిల్లాలోని ఈ ప్రాజెక్టుకు నీరు రావాల్సి ఉన్న ఎగువ ప్రాంతాల్లో పనులు వేగిరం చేయాలని ఏడాది నుంచి అధికారులపై వత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. తమకు ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావంటూ కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు.