రాష్ట్రీయం

సెప్టెంబర్‌లో షార్ నుండి రెండు ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) సెప్టెంబరు నెలలో జిఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి రెండు ప్రయోగాలు జరిపేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) వేదిక కానుంది. సెప్టెంబరు రెండో వారంలో జిఎస్‌ఎల్‌వి- ఎఫ్ 05, సెప్టెంబరు చివరిలో పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాల నుండి సమాచారం. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక పై జిఎస్‌ఎల్‌వి రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి. మాములుగానైతే ఈ నెల 29న ప్రయోగించేందుకు ఇస్రో మూహర్తం ఖరారు చేయగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఇన్‌శాట్-3డి ఆర్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఉపగ్రహంలో లోపాన్ని సరిచేసి సెప్టెంబరు 8న ప్రయోగించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సెప్టెంబరు నెలాఖరులో ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ పనులు షార్‌లోని మొదటి ప్రయోగ వద్ద మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి చివరి భాగంలో ఉపగ్రహాలను అమర్చనున్నారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి స్కైశాట్ ఉపగ్రహంతోపాటు ఐఐటి ముంబాయి విద్యార్థులు రూపొందించిన ప్రతమ్, పైశాట్ అనే రెండు చిన్న ఉపగ్రహాలు విదేశాలకు చెందిన మరో 5 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే షార్‌కు చేరుకొన్న ఉపగ్రహం తుది పరీక్షలు శాస్తవ్రేత్తలు నిర్వహించి క్లీన్ రూమ్‌లో పెట్టి ఉన్నారు. ఈ ప్రయోగాన్ని సెప్టెంబరు 28న జరిపేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది. ఒకే నెలలో రెండు ప్రయోగాలు చేపట్టనున్నడంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. కాని ఈ ప్రయోగ తేదీలు ఇస్రో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.