రాష్ట్రీయం

కొలువుల మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలుకానుంది. రాష్ట్రం విడిపోయిన తరువాత రెండేళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఇది పెద్ద శుభవార్త. ఇటీవలే ఆరు ప్రభుత్వ శాఖల్లో 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే కోవలో ఈసారి పెద్ద స్థాయిలో 4009 పోస్టులను భర్తీ చేసేందుకు సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎపిపిఎస్‌సి చైర్మన్ పి ఉదయ్‌భాస్కర్ తెలిపారు.
విశాఖలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి మొత్తం 4009 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే శాఖల వారీగా ఖాళీల వివరాలు, నివేదికలు పరిశీలించామన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఎపిపిఎస్‌సిలో గ్రూప్ ఉద్యోగాల భర్తీని మరింత సమర్థంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ లోపాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఆయన ప్రకటించారు.
పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితర విషయాల్లో మాన్యువల్ విధానానికి స్వస్తి చెప్పనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను ఇక మీదట ఎపిపిఎస్‌సి వెబ్‌సైట్ ద్వారా వెల్లడించనున్నామని, ఎపిపిఎస్‌సి కేలండర్‌ను ముందుగానే ప్రకటించనున్నామన్నారు. గ్రూప్ 2,3,4 పోస్టులకు పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్క్రీనింగ్ ద్వారా వడపోత చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. కొన్ని పోస్టుల భర్తీకి ఇంటర్వూ విధానం లేనందున అక్రమాలకు ఆస్కారం లేకుండా విడతల వారీగా నిర్వహిస్తామన్నారు. ఇక స్థానికత అంశంపై రాష్టప్రతి ఉత్తర్వుల ఆధారంగానే స్థానికతను గుర్తించి పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు ఉదయ్‌భాస్కర్ ప్రకటించారు. ఎపిపిఎస్‌సి సిలబస్‌లో ప్రస్తుతానికి మార్పులేమీ ఉండవని తెలిపారు. గతంలో 2011 గ్రూప్ 1 పరీక్షలను తిరిగి నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే పాత సిలబస్ మేరకు పరీక్షల ఉంటాయన్నారు. రాష్టవ్రిభజన నేపథ్యంలో పోస్టుల భర్తీకి కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, ఇప్పటికే సుమారు 500 వరకూ కోర్టు కేసులు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో ఎపిపిఎస్‌సి పోస్టుల భర్తీని చేపడుతుందని, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోనున్నట్టు ఆయన తెలిపారు.