రాష్ట్రీయం

త్వరితగతిన హంద్రీ-నీవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: నదీ జలాల అనుసంధానం, జల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పథకం రెండవ దశను త్వరగా పూర్తిచేయాలని సంకల్పించింది. శ్రీశైలం జలాశయం మిగులు నీరు 40 టిఎంసిలతో రాయలసీమను సస్యశ్యామలం చేయడంతోపాటు ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన ఓ బృహత్తర పథకం ఇది. సీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు మంచినీరు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. మొదటి దశలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో 1,18,800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, నాలుగు లక్షల మంది జనాభాకు మంచినీరు అందించాలన్నది ప్రతిపాదన. రెండవ దశలో అనంతపురం జిల్లాలో 2,27,000 ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మంది జనాభాకు మంచినీరు అందించాలని నిర్దేశించారు. ఈ ఏడాది జూన్ 15నాటికి పథకం మొదటి దశ 85.13 శాతం పూర్తి కాగా, రెండవ దశ 67.14 శాతం పూర్తయింది. మొదటి దశ తవ్వవలసిన మొత్తం కాలువ 107.973 కిలోమీటర్లను 2014 మార్చి 31 నాటికే పూర్తి చేశారు. మొదటి దశ పథకం నిర్మాణ ఒప్పంద విలువ మొత్తం రూ.500.50 కోట్లు కాగా, 2014 మార్చి 31 వరకు రూ.418.27 కోట్లు ఖర్చు చేశారు. రెండవ దశ పథకం మొత్తం సివిల్ ప్యాకేజీల సంఖ్య 28కాగా, ఒకటి మెకానికల్ ప్యాకేజీ (మడకశిర ఉపకాలువ). దీని నిర్మాణ ఒప్పంద విలువ రూ.2427.29 కోట్లు. ఈ ఏడాది మార్చి 31 వరకు 1399.415 కోట్లు ఖర్చు చేశారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 15 వరకు రూ.230 కోట్లు ఖర్చు చేశారు.