రాష్ట్రీయం

పుస్తకమే జ్ఞానానికి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పిల్లల్లో బాల్యం నుంచే పఠనాసక్తిని పెంపొందింపజేయాలని గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో పఠనాసక్తి పెరిగే విధంగా పుస్తకాలను చదివించాలని సూచించారు. అందుకోసం ఓ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని ఇరు రాష్ట్రాలకు చెందిన ఈటెల రాజేందర్, బుద్ధప్రసాద్‌లను కోరారు. ప్రపంచానికి భారత్ గొప్ప విజ్ఞానాన్ని అందించిందని, భారతీయులు ఎందులోనూ తక్కువ కాదని అన్నారు. దేశ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. కంప్యూటర్లు వద్దనడంలేదని కానీ పుస్తకమే జ్ఞానానికి పునాది గవర్నర్ తెలిపారు. తెలంగాణమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు పుస్తకాలతోనే సాధ్యమవుతుందన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తనను పుస్తకాలే కదిలించాయని, కదిలేది కదిలించేది..పెను నిద్దుర వదిలించేది.. మునుముందుకు నడిపించేది..కావాలోరుూ నవ కదనానికి అంటూ ఆయన శ్రీశ్రీ గీతాన్ని ఉటంకించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తాను పుస్తకాలతోనే జీవనయానం సాగిస్తున్నానన్నారు. పుస్తకాలు ఇచ్చిన చైతన్యమే సమాజాన్ని నడిపిస్తుందన్నారు. పుస్తక పఠనం అంటే తనకెంతో ప్రాణమన్నారు. సభకు అధ్యక్షత వహించిన బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ పుస్తకాలు చదువుకొని వచ్చిన నాయకులకు రియల్ ఎస్టేట్, ఆర్థిక దందాలతో ఎదిగొచ్చిన నాయకులకు ఎంతోతేడా ఉంటుందన్నారు.
chitram...
హైదరాబాద్‌లో జరుగుతున్న బుక్‌ఫెయర్‌లో మంగళవారం పాల్గొని పుస్తకాలను తిలకిస్తున్న గవర్నర్ నరసింహన్