రాష్ట్రీయం

మేమంతా కలిసే ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 25: తనకు చిత్రపరిశ్రమలో ఎవరితో విరోధం లేదని, ఆ మాటకు వస్తే సినీ పరిశ్రమలో ఎవరు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోరని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అన్నారు. ఇటీవల బెంగళూరులో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సినిమా రంగంలో అందరూ స్నేహపూర్వకంగా ఉంటారని, అయితే అభిమానుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటారో అర్థంకాదన్నారు. అభిమానం ఉండాలేకానీ మితిమీరిన అభిమానం ఉండకూడదన్నారు.
సమాజ సేవలో పోటీతత్వం ఉండాలేకానీ అది శృతిమించి చంపుకునేంత వరకు వెళ్లడం మంచిదికాదన్నారు. హింసాత్మకమైన సంఘటనలకు అభిమానులు తెగబడటం సహించరానిదన్నారు. ఇది ఎవరికీ మంచిది కాదన్నారు. ఇలాంటి విషయాలపై తను త్వరలోనే అభిమానులకు ఒక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అవయవదానంపై బెంగళూరులో జరిగిన అవగాహన కార్యక్రమంలో వినోద్ పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం వారు పక్కా ప్రణాళికతో డాబాలో వినోద్‌ను కత్తులతోపొడిచి హత్యచేశారు.
తమ కుమారుడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న వినోద్ తల్లిదండ్రులు మంగళవారం వినోద్ మృతదేహాన్ని తిరుపతికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. తన అభిమాని హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న పవన్‌కల్యాణ్ గురువారం తిరుపతికి వచ్చి వినోద్ కుటుంబాన్ని ఓదార్చారు. మీకు పెద్దకొడుకులా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. హత్యోదంతంపై కర్ణాటకపోలీసులతో చర్చించి దోషులకు శిక్షపడేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై దోషులను శిక్షించడంలో కర్నాటక ప్రభుత్వం విఫలమైతే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి సిబిఐ విచారణ కోరుతానన్నారు.

చిత్రం.. హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని ఓదారుస్తున్న పవన్‌కల్యాణ్