రాష్ట్రీయం

ఎస్‌ఏఆర్‌టియుసి అధ్యక్షుడిగా మళ్లీ సంజీవరెడ్డి ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టియుసి) జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి ‘సౌత్ ఆసియన్ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఎస్‌ఏఆర్‌టియుసి) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన కార్మిక సదస్సులో ఆయన రెండోసారి ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఐఎన్‌టియుసి కార్యదర్శి ఎ నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పట్ల పలువురు ఐఎన్‌టియుసి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.