రాష్ట్రీయం

వరుస పేలుళ్లకు తొమ్మిదేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: హైదరాబాద్ నగరంలో వరుస బాంబు పేలుళ్లు జరిగి తొమ్మిదేళ్లు గడిచాయి. నగరంలోని లుంబిని పార్క్, గోకుల్ ఛాట్ వద్ద జరిగిన భారీ పేలుళ్లలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్ వరకు సిపిఐ కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించింది. పేలుళ్లలో మృతి చెందిన వారికి నివాళులర్పించింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్ కార్యకర్తలు బాంబు పేలుళ్ల మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిన బూనారు. వరుస బాంబు పేలుళ్లలో గాయపడిన 14 మందిలో కొందరు కాళ్లు, చేతులు, కళ్లు పోగొట్టుకున్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కొంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంది. గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం తన కన్ను చితికిపోయి తొమ్మిదేళ్లు గడుస్తున్నా నేటికీ పరిహారం అందజేయలేదని బాధితుడు రషీద్ వాపోయాడు.