రాష్ట్రీయం

సూపర్-హెవీ మూలకాన్ని కనుగొన్న ఏయు పూర్వ విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వ విద్యార్థి, ప్రముఖ నూక్లియర్ ఫిజిసిస్టు ఆచార్య ఆకునూరి వి.రామయ్య కొత్తగా ఒక సూపర్-హెవీ మూలకాన్ని కనుగొన్నారు. టెనె్నస్సిన్-117 (టిఎస్-117)గా వ్యవహరించే మూలకాన్ని కనుగొన్నారని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య జి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. కొత్త మూలకాన్ని కనుగొని, దానిని పిరియాడిక్ టేబుల్‌కు చేర్చడంలో అమెరికాకు చెందిన వాండెర్‌బిల్ట్ వర్సిటీ ఫిజిక్స్ విభాగానికి చెందిన ఆచార్య రామయ్య, ఆచార్య జోసెఫ్ హామిల్టన్ కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని టెనె్నస్సీ రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని మూలకాన్ని టెనె్నస్సిన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి ప్రతిభను గుర్తించి అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జిమ్ కూపర్ ఇటీవల అక్కడ సత్కరించారు. ఈ ఆవిష్కరణలో రష్యాకు చెందిన ఫ్లెరోవ్ ల్యాబోరేటరీ ఫర్ నూక్లియర్ రియాక్షన్స్ సహకారం కూడా ఉంది. ఎయు ఫిజిక్స్ విభాగంలో ఆచార్య రామయ్య 1957-58లో పిజి చదివారు. ఆ తరువాత పిహచ్‌డి నిమిత్తం అమెరికాలోని ఇండియానా వర్సిటీకి 1964లో వెళ్లారు. వాండర్‌బిల్ట్ వర్సిటీలో 1964 నుంచి పని చేస్తున్నారు.

చిత్రం..ఆచార్యులు రామయ్య, జోసెఫ్ హామిల్టన్‌లను అభినందిస్తున్న అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జిమ్ కూపర్