తీర్పు ఇచ్చే రోజు వాయిదా అడగడమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: స్విస్ చాలెంజ్ విధానం కింద అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలో 6.84 చ.కి.మీ పరిధిలో అభివృద్ధి నిమిత్తం ప్రాజెక్టుకు సంబంధించి రెవెన్యూ వాటాను వెల్లడిస్తామని కాంట్రా క్టు సంస్థ నిర్ణయం తీసుకుందని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పనులకు స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్లను జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. ఈ సందర్భంగా ఏపి అడ్వకేట్ జనరల్ ఒక మెమోను కోర్టుకు సమర్పించారు. శుక్రవారం కేసు విచారణ సమయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఉదయం కేసు విచారణ ప్రారంభం కాగానే, అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కన్సార్టియం ఏ మేరకు రెవెన్యూ ఇవ్వాలో సిఆర్‌డిఏకు తెలియచేసిందన్నారు. ఇవే వివరాలను కోర్టుకు తెలియచేయాలని సిఆర్‌డిఏ నిర్ణయించిందన్నారు. అర్హులైన బిడ్డర్లకు మాత్రమే తెలియచేస్తామని, దీనికి సంబంధించి వివరాలు, నిబంధనలపై కసరత్తు జరుగుతోందని, త్వరలో ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నట్లు ఏజి హైకోర్టుకు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు, సమాచారాన్ని తెలియచేసేందుకు వీలుగా కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదావేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ కేసుపై తీర్పును శుక్రవారం ఇవ్వాలని కోర్టు నిర్ణయించిందని, ఈ సమయంలో వాయిదా కోరడం సబబు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఒకసారి నోటిఫికేషన్ జారీ చేస్తే మార్పులు చేయరాదని, తాజా నోటిఫికేషన్ ఇవ్వాలంటే, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. బిడ్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 1 అని , తమ క్లయింటు ప్రతిపాదనలు సమర్పించేందుకు వీలుగా తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఏజి వాదనలు వినిపిస్తూ పోటీపడే అందరు బిడ్డర్లకు ప్రభుత్వం తగిన వ్యవధి ఇస్తుందని, అవసరమైన సవరణలు కూడా చేస్తామని తెలిపారు. అనంతరం ఈ మేరకు మెమో దాఖలు చేయాలంటూ కేసు విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2.30కు వాయిదావేసింది.
విచారణ మధ్యాహ్నం ప్రారంభమైన వెంటనే, అడ్వకేట్ జనరల్ మెమోను కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వం, ఎంపికైన కన్సార్టియంకు రెవెన్యూ వాటాల విషయమై సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తారని, కేసును మంగళవారానికి వాయిదా వేయాలని ఏజి కోర్టును కోరారు. ఏజి వినతిని ఆమోదించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను శనివారం చేపడుతామని చెప్పగా మంగళవారానికి వాయిదా వేయాలని ఏజి కోర్టును కోరారు. హైకోర్టు సోమవారం వాదనలు వింటామంటూ వాయిదా వేసింది. సాయంత్రం 4.30 గంటలకు ఏజి మళ్లీ ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదావేయాలని, వివరాలు వెల్లడించేందుకు కనీసం మూడు రోజులు సమయం కావాలని అధికారులు కోరారని ఏజి కోర్టుకు విన్నవించారు. అనంతరం ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.