రాష్ట్రీయం

పట్టుదలతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 26: కృష్ణా పుష్కరాలలో పని చేసిన స్ఫూర్తితో వ్యవసాయశాఖ, జలవనరుల శాఖ, విద్యుత్ శాఖ, రెవిన్యూ శాఖల యంత్రాంగం పనిచేసి వర్షపాత అంతరాయాలు(డ్రైస్పెల్స్) అధిగమించాలని, పంట ఎండకుండా కాపాడాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. వ్యవసాయశాఖ అధికారులతో శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షపాతంలో అంతరాయాలు కూడా ఒక విపత్తేనంటూ, సమర్ధంగా పని చేసేందుకు ఇదొక అవకాశంగా పేర్కొన్నారు. స్ఫూర్తిదాయకంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ‘అందుబాటులో డ్రిప్ వ్యవస్థ ఉంది, పైపులున్నాయి, ట్యాంకర్లున్నాయి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వినియోగించుకోవాలని, ఒక్క ఎకరంలో కూడా పంట ఎండిపోకుండా చూడాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాలుగు శాఖలు సమన్వయంగా పని చేయడం ద్వారా ప్రస్తుత డ్రైస్పెల్‌ను సమర్ధంగా ఎదర్కోవచ్చన్నారు. ప్రతిరోజు కమాండ్ కంట్రోల్ రూం నుంచి తాను పర్యవేక్షిస్తానని, క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతానన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు నాలుగువేల గ్రామాలలో ట్యాంకర్లను నీటి సరఫరాకు వినియోగించారంటూ వాటన్నింటినీ ప్రస్తుతం ఉపయోగంలోకి తేవాలన్నారు. ఒక తుపాను వస్తే ఎలా ఎదుర్కొన్నామో, ఒక పుష్కరాలను ఎలా విజయవంతం చేశామో అలా స్ఫూర్తిగా తీసుకుని వర్షపాత అంతరాయాలను ఎదుర్కోవాలని, పట్టుదలగా చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఫిషరీస్, డెయిరీ, పౌల్ట్రీ అన్నీ ఉమ్మడి వేదిక రావాలన్నారు. రెయిన్ గన్స్ వినియోగం వల్ల గుంటూరు, ప్రకాశంలో సత్ఫలితాలు వచ్చాయని, రాయలసీమలో సమర్ధంగా వినియోగించి పంటలను కాపాడాలని కోరారు. ఏ పంటకు ఏ దశలో ఎన్ని రక్షణ తడులు ఇవ్వాలి, ఎంత వ్యవధిలో తడులు ఇవ్వాలి అన్నీ రికార్డ్‌గా చేస్తే తర్వాత సీజన్‌కు పని సులువు అవుతుందన్నారు.
జెసిలు, ఆర్డీవోలదే బాధ్యత
పంటలను కాపాడే బాధ్యతను జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు భుజానకెత్తుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. జలాశయాలు, పంటకుంటలలో నీటి నిల్వ చేయడం, సాగునీటి వినియోగం, పంటలను కాపాడటంలో జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయంగా పని చేయాలన్నారు. సాయిల్ టెస్టింగ్, ఈ క్రాపింగ్, పంట బీమా, మెకనేజేషన్, ఇన్‌పుట్స్ పంపిణీ, అన్నింటిలో టెక్నాలజీ వినియోగం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీ వినియోగంలో ఒక్క సీజన్ మనం కష్టపడితే తర్వాత సీజన్‌లన్నీ పనులు సులువు అవుతాయన్నారు. అన్ని శాఖలలో కైజాలా వినియోగించాలని కోరారు. విత్తనాలు వేయడం దగ్గర నుంచి పంట ఎదుగుదలపై దశల వారీగా పొటోలు తీసి పంపడంలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎంపిక చేసిన డ్వాక్రా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
3రోజుల్లో 4 లక్షల విద్యుత్ స్తంభాలను జియో ట్యాగింగ్ చేసిన అనుభవం మనకుందని, వారి సేవలను వినియోగించుకుంటే పంటకుంటలను, పంటలను జియోట్యాగింగ్ చేయడం పెద్దకష్టం కాదన్నారు. వర్షాధార ప్రాంతాలన్నింటిలో బహుళ పంటల సాగును ప్రోత్సహించాలని, నవధాన్యాల సాగును మరింత సమర్ధంగా మెట్ట రైతుల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. అవసరమైన ప్రాంతాలలో పశుగ్రాసం సరఫరాకు సిద్ధం చేసుకోవాలన్నారు. పాడి పరిశ్రమలో 25% వృద్ధి సాధించాలని, మత్స్య పరిశ్రమలో 10% అదనపు వృద్ధి సాధించాలని దశానిర్ధేశం చేశారు. ఒత్తిడిని అధిగమించడం, వర్షపాత అంతరాయాలులో మంత్రులు, సీనియర్ అధికారులు భాగస్వాములు కావాలని, కమాండ్ కంట్రోలు రూము నుంచి ప్రతిరోజు సమీక్షించాలన్నారు.