రాష్ట్రీయం

బొట్టు బొట్టుకూ లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 27: రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకునేలా లెక్కుండాలని, ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో రియల్ టైమ్ వాటర్ ఆడిటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో లభ్యమవుతున్న జలవనరుల తాజా సమాచారాన్ని అందిస్తామని, టెక్నాలజీని వినియోగించుకుని పంటలు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు నిర్దేశించారు. తుపాన్ కంటే కరువు ప్రమాదకరమని, కరువును జయించేందుకు అందరూ కదిలి రావాలన్న ముఖ్యమంత్రి వర్షాభావ పరిస్థితులపైనా వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం విజయవాడలోని తన కార్యాలయంలో వ్యవసాయ పనుల పురోగతి - నీటి వనరుల లభ్యత, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెయిన్
గన్ల వినియోగం ద్వారా పంటలు కాపాడటం దేశంలోనే కొత్త ప్రయోగమని, దీనిని విజయవంతం చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెయిన్ గన్లు, స్ప్రింక్లర్లతో రోజుకు కనీసం 30 నుంచి 40 వేల ఎకరాలకు నీరందించేలా కృషి చేయాలని చెప్పారు.
వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్న అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు అవసరమయ్యే రెయిన్‌గన్లను అదనంగా సర్దుబాటు చేయాలని సూచించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 6,191 రెయిన్ గన్లను ఉపయోగించి 56,400 హెక్టార్లలో పంటలకు నీరందించినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి రాజవౌళి, సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న, పలువురు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

చిత్రం.. విజయవాడలో ‘వనం మనం’ కార్యక్రమంలో చీపురుపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు