రాష్ట్రీయం

జనవరి 6నుంచి విశాఖలో అంతర్జాతీయ హిందీ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), ఆగస్టు 27: హిందీ బోధనలో ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 8వరకు నగరంలోని గీతం యూనివర్శిటీ వేదికగా ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. హిందీ సంఘం ఫౌండేషన్ (యుఎస్‌ఏ, న్యూజెర్సీ), లోక్‌నాయక్ ఫౌండేషన్ (విశాఖపట్నం), యువ హిందీ సాంతన్ (యుఎస్‌ఏ), ఇంటర్నేషనల్ హిందీ అసోసియేషన్ (యుఎస్‌ఏ, న్యూయార్క్)ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుందన్నారు. నాల్గవ అంతర్జాతీయ హిందీ సదస్సులో ప్రపంచ దేశాల్లో హిందీయేతర ప్రాంతాల్లో హిందీ బోధనలో సమస్యలపై చర్చిస్తామన్నారు. విదేశాల నుంచి 50 మంది, దేశం నలుమూలల నుంచి 220 మంది ప్రొఫెసర్లు పాల్గొంటారన్నారు. హిందీ సంఘం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అశోక్ ఓజా మాట్లాడుతూ అమెరికాలోని 114 యూనివర్శిటీల్లో హిందీని ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న లోక్‌నాయక్ ఫౌండేషన్ నేత యార్లగడ్డ